నాకసలు పేరే లేదు | keerthi romance with suriya in vignesh shivan movie | Sakshi
Sakshi News home page

నాకసలు పేరే లేదు

Published Tue, Jan 2 2018 8:13 AM | Last Updated on Tue, Jan 2 2018 8:13 AM

keerthi romance with suriya in vignesh shivan movie - Sakshi

తమిళసినిమా: నాకసలు పేరే లేదు అంటోంది నటి కీర్తీసురేశ్‌. ఏమిటీ పేరులోనే కీర్తిని ఇమిడించుకున్న ఈ సుందరి పేరే లేదంటోందని ఆశ్చర్యపోతున్నారా? అనతి కాలంలోనే అగ్ర నటి స్థాయికి చేరుకున్న కథానాయకల్లో కీర్తీసురేశ్‌ ఒకరు. ఈ బ్యూటీ నటించిన రెండు చిత్రాలు ఈ నెలలో తెరపైకి రావడానికి ముస్తాబవుతున్నాయి. అందులో ఒకటి తెలుగు, మరొకటి తమిళం చిత్రం. కోలీవుడ్‌ చిత్రం విషయానికొస్తే సూర్యకు జంటగా నటించిన తానాచేర్న్‌ద కూటం చిత్రం పొంగల్‌ విందుగా తెరపైకి రానుంది. స్టూడియోగ్రీన్‌ పతాకంపై జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విఘ్నేశ్‌శివ దర్శకుడు. అనిరుధ్‌ సంగీతం అందించారు. చిత్రంలో నటించిన అనుభవం గురించి కీర్తీసురేశ్‌ తెలుపుతూ కథతో పాటు, తన పాత్ర బాగా నచ్చేసిందని తెలిపింది.

ఇందులో తాను బ్రాహ్మణ యువతిగా నటించానని, నటనకు అవకాశం ఉన్న పాత్ర అని చెప్పింది. ఇందులో నా పాత్రకు పేరే లేదు అని తెలిపింది. తాను పాఠశాలలో చదువుకుంటున్న సమయం నుంచే సూర్య అభిమానినని చెప్పింది. తన తల్లి, సూర్య తండ్రి శివకుమార్‌తో కలిసి మూడు చిత్రాల్లో నటించారని, అప్పుడే తానూ శివకుమార్‌ కొడుకు సూర్యతో నటిస్తానని చెప్పానని అంది. అది ఇప్పుడు నిజం కావడం సంతోషంగా ఉందని చెప్పింది. సూర్య చాలా శాంత స్వభావి అని, ఎక్కువగా మాట్లాడరని చెప్పింది. ఈ చిత్రంలో సెంథిల్‌తో కలిసి నటించడం మరపురాని అనుభవంగా పేర్కొంది. ఆయన టెడ్డీబేర్‌లా చాలా క్యూట్‌ వ్యక్తి అని కితాబిచ్చింది. నటి రమ్యకృష్ణ తన తల్లి స్నేహితురాలని, చిన్నతనం నుంచే తనకు తెలుసని చెప్పింది. తానాసేర్న్‌కూట్టం చిత్రం ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకుంటుందనే నమ్మకాన్ని కీర్తీ వ్యక్తం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement