vighnesh
-
నాకసలు పేరే లేదు
తమిళసినిమా: నాకసలు పేరే లేదు అంటోంది నటి కీర్తీసురేశ్. ఏమిటీ పేరులోనే కీర్తిని ఇమిడించుకున్న ఈ సుందరి పేరే లేదంటోందని ఆశ్చర్యపోతున్నారా? అనతి కాలంలోనే అగ్ర నటి స్థాయికి చేరుకున్న కథానాయకల్లో కీర్తీసురేశ్ ఒకరు. ఈ బ్యూటీ నటించిన రెండు చిత్రాలు ఈ నెలలో తెరపైకి రావడానికి ముస్తాబవుతున్నాయి. అందులో ఒకటి తెలుగు, మరొకటి తమిళం చిత్రం. కోలీవుడ్ చిత్రం విషయానికొస్తే సూర్యకు జంటగా నటించిన తానాచేర్న్ద కూటం చిత్రం పొంగల్ విందుగా తెరపైకి రానుంది. స్టూడియోగ్రీన్ పతాకంపై జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విఘ్నేశ్‌శివ దర్శకుడు. అనిరుధ్ సంగీతం అందించారు. చిత్రంలో నటించిన అనుభవం గురించి కీర్తీసురేశ్ తెలుపుతూ కథతో పాటు, తన పాత్ర బాగా నచ్చేసిందని తెలిపింది. ఇందులో తాను బ్రాహ్మణ యువతిగా నటించానని, నటనకు అవకాశం ఉన్న పాత్ర అని చెప్పింది. ఇందులో నా పాత్రకు పేరే లేదు అని తెలిపింది. తాను పాఠశాలలో చదువుకుంటున్న సమయం నుంచే సూర్య అభిమానినని చెప్పింది. తన తల్లి, సూర్య తండ్రి శివకుమార్‌తో కలిసి మూడు చిత్రాల్లో నటించారని, అప్పుడే తానూ శివకుమార్ కొడుకు సూర్యతో నటిస్తానని చెప్పానని అంది. అది ఇప్పుడు నిజం కావడం సంతోషంగా ఉందని చెప్పింది. సూర్య చాలా శాంత స్వభావి అని, ఎక్కువగా మాట్లాడరని చెప్పింది. ఈ చిత్రంలో సెంథిల్‌తో కలిసి నటించడం మరపురాని అనుభవంగా పేర్కొంది. ఆయన టెడ్డీబేర్‌లా చాలా క్యూట్ వ్యక్తి అని కితాబిచ్చింది. నటి రమ్యకృష్ణ తన తల్లి స్నేహితురాలని, చిన్నతనం నుంచే తనకు తెలుసని చెప్పింది. తానాసేర్న్కూట్టం చిత్రం ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకుంటుందనే నమ్మకాన్ని కీర్తీ వ్యక్తం చేసింది. -
క్వార్టర్స్‌లో అనిరుధ్–విఘ్నేశ్ జంట
ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నమెంట్ బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) పురుషుల ఫ్యూచర్స్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ఆటగాళ్లు ముందంజ వేశారు. డబుల్స్ విభాగంలో అనిరుధ్ బ్రదర్స్ జోడీ, విష్ణువర్ధన్ జోడీ క్వార్టర్స్‌కు చేరుకోగా... సింగిల్స్ విభాగంలో రిషబ్ అగర్వాల్ ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించాడు. కర్ణాటక స్టేట్ లాన్ టెన్నిస్ అసోసియేషన్‌లో సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో అనిరుధ్ చంద్రశేఖర్– విఘ్నేశ్ ద్వయం 6–4, 0–6, 10–7తో అన్విత్ బెంద్రె–మోహిత్ మయూర్ జయప్రకాశ్ (భారత్) జంటపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో టాప్ సీడ్ విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ జంట 6–1, 6–3తో నిక్షేప్ రవికుమార్– సూరజ్ ప్రబోధ్ జోడీని ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో తేజస్ చౌకుల్కర్–నికి కలియండ పూనచ (భారత్) జంట 6–4, 7–6 (5)తో విజయంత్ మలిక్–సిద్ధార్థ్ రావత్ జోడీపై, వశిష్ట్ చెరుకు–ప్రజ్వల్ దేవ్ (భారత్) జంట 7–6 (4), 6–3తో అర్జున్ మరియప్ప–దక్షిణేశ్వర్ సురేశ్ జోడీపై గెలుపొందాయి. రిషబ్ ముందంజ మరోవైపు పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రిషబ్ అగర్వాల్ 6–0, 6–3తో ఆదిత్య హరి ససోంగ్కో (ఇండోనేసియా)పై గెలుపొంది ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో మోహిత్ మయూర్ జయప్రకాశ్ 3–6, 6–4, 6–4తో నికి కలియండ పూనచపై, విజయ్ సుందర్ ప్రశాంత్ 6–4, 7–5తో జతిన్ దహియాపై, సిద్ధార్థ్ రావత్ 6–3, 7–5తో అభినవ్ సంజీవ్ షణ్ముగమ్పై, శశికుమార్ ముకుంద్ 6–3, 6–1తో జేసన్ పాట్రోంబోన్ (ఫిలిప్పీన్స్)పై గెలుపొంది తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు.