
కృష్ణమూర్తి కథ!
అతనో సాధారణ లెక్చరర్. పేరు కృష్ణమూర్తి. సజావుగా సాగిపోతున్న ఆ లెక్చరర్ జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఆ తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అనే కథతో రూపొందుతున్న చిత్రం ‘మనలో ఒకడు’. సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ నటించి, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జి.సి జగన్‌మోహన్ నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ 90 శాతం పూర్తయింది.
ఈ నెల 16 నుంచి నెలాఖరు వ రకూ జరిగే షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.జె.సిద్ధార్థ్, సంగీతం: ఆర్.పి పట్నాయక్, సహ నిర్మాతలు: ఉమేశ్ గౌడ, బాలసుబ్రహ్మణ్యం.