మనలో ఒక్కడు ఏం చేస్తాడు?
‘శీను వాసంతి లక్ష్మి’, ‘బ్రోకర్’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి, దర్శకత్వం వహించిన సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ప్రస్తుతం చేస్తున్న చిత్రం ‘మనలో ఒకడు’. ఆర్పీ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యునిక్రాఫ్ట్ మూవీస్ పతాకంపై జీసీ జగన్మోహన్ నిర్మిస్తున్నారు.
ఆర్పీ మాట్లాడుతూ- ‘‘సుమారు 50 కథలు విన్నా ఒక్క కథ కూడా జగన్మోహన్గారికి నచ్చలేదు. నేను చెప్పిన కథ నచ్చి వెంటనే, సినిమా మొదలు పెట్టమన్నారు. సిల్లీగా అనిపించే విషయాలే చాలా సీరియస్గా మారిపోతుంటాయనే లైన్తో తీస్తున్నాం’’ అని తెలిపారు. ‘‘సమాజానికి ఉపయోగపడే చిత్రం నిర్మించాలనే ఆశయంతో ఈ చిత్రం చేస్తున్నా’’ అని నిర్మాత చెప్పారు. ఆర్పీకి జోడీగా ‘నువ్వు నేను’ ఫేం అనిత నటిస్తున్నారు.
సాయికుమార్, నాజర్, తనికెళ్ల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: తిరుమల్ నాగ్, కెమేరా: ఎస్జె సిద్ధార్థ్, సహ నిర్మాతలు: హెచ్ఏ ఉమేష్ గౌడ, పి. బాల సుబ్రహ్మణ్యం, కథ-స్క్రీన్ప్లే-సంగీతం-దర్శకత్వం: ఆర్పీ పట్నాయక్.