RP Patnayak
-
చాలా రోజుల తర్వాత పాట పాడా
‘‘చాలా రోజుల విరామం తర్వాత ‘ప్రణవం’ చిత్రంలో ఒక మంచి మెలోడీ సాంగ్ పాడాను. ఈ పాట శ్రోతలకు నచ్చుతుంది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు’’ అని సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ అన్నారు. ‘ఈ రోజుల్లో’ శ్రీ మంగం, శశాంక్, అవంతిక హరి నల్వా, గాయత్రి అయ్యర్ ముఖ్య తారలుగా కుమార్ జి. దర్శత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రణవం’. చరిత అండ్ గౌతమ్ ప్రొడక్షన్స్ పతాకంపై తను. ఎస్ నిర్మించారు. పద్మారావ్ భరద్వాజ్ స్వరపరచిన ఈ సినిమాలోని రెండవపాటను ఆర్.పి. పట్నాయక్ విడుదల చేశారు. ఈ పాటను ఆర్.పి.పట్నాయక్, ఉష కలిసి పాడటం విశేషం. హీరో శ్రీ మంగం మాట్లాడుతూ– ‘‘సరికొత్త కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. మార్చిలో సినిమాని రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఆర్పీగారు పాడిన పాట అందరికీ నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు. ‘‘ఇటీవల మా చిత్రంలోని తొలిపాటను విడుదల చేయగా మంచి స్పందన వస్తోంది’’ అని పద్మారావ్ భరద్వాజ్ అన్నారు. పాటల రచయిత కరుణ కుమార్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మార్గల్ డేవిడ్, సహ నిర్మాతలు: వైశాలి, అనుదీప్. -
బాలీవుడ్‌పై దృష్టి
– సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మహానంది: తెలుగు సినిమా రంగంపై కాకుండా ప్రస్తుతం బాలీవుడ్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించానని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం మహానందికి వచ్చారు. ఈ సందర్భంగా వారు శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకుని పూజలు చేపట్టారు. ఆలయ సూపరింటెండెంట్ ఈÔ¶శ్వర్‌రెడ్డి, వేదపండితులు రవిశంకర అవధానిలు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు చేశారు. దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు సుమారు 60 తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించినట్లు చెప్పారు. ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టి సారించానని, ఏడాది వరకు ఖాళీ లేదన్నారు. తెలుగులో నటించిన శీను..వాసంతి..లక్ష్మి, బ్రోకర్ చిత్రాలకు మంచి ఆదరణ లభించిందన్నారు. అలాగే మనలో ఒకడు చిత్రంలో వేసిన పాత్రకు ప్రేక్షకులు మంచి ఆదరణ ఇచ్చారన్నారు. డాక్టర్ సి.నారాయణరెడ్డి మృతి చిత్రరంగానికి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. -
కృష్ణమూర్తి కథ!
అతనో సాధారణ లెక్చరర్. పేరు కృష్ణమూర్తి. సజావుగా సాగిపోతున్న ఆ లెక్చరర్ జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఆ తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అనే కథతో రూపొందుతున్న చిత్రం ‘మనలో ఒకడు’. సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ నటించి, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జి.సి జగన్మోహన్ నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ 90 శాతం పూర్తయింది. ఈ నెల 16 నుంచి నెలాఖరు వ రకూ జరిగే షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.జె.సిద్ధార్థ్, సంగీతం: ఆర్.పి పట్నాయక్, సహ నిర్మాతలు: ఉమేశ్ గౌడ, బాలసుబ్రహ్మణ్యం. -
'అత్తో అత్తమ్మ కూతురో' నిర్మాతపై దావా
హైదరాబాద్ : 'అత్తో అత్తమ్మ కూతురో' సీరియల్ నిర్మాతలపై సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కోర్టుకు వెళ్లనున్నారు. ఆ సీరియల్ నిర్మాతలపై రూ.50 లక్షల పరిహారం కోరుతూ దావా వేస్తున్నట్లు ఆయన శుక్రవారమిక్కడ తెలిపారు. జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న 'అత్తో అత్తమ్మ కూతురు' సీరియల్లో ఇంకా రిలీజ్ కాని 'తులసీదళం' సినిమా ట్రాక్‌లను అనుమతి లేకుండా ఉపయోగించారని ఆయన చెప్పారు. కాగా జూన్ నుంచి ప్రసారమవుతున్న ఈ సీరియల్ లో అలనాటి నటి నిరోష, జాకి, మహర్షి తదితరులు నటిస్తున్నారు. సీరియల్ ప్రారంభమై గట్టిగా 2 నెలలు గడవక ముందే వివాదంలో చిక్కుకుంది. -
గౌతమికి నీరాజనం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : గోదావరి మహా పుష్కరాలకు భక్తజన ప్రవాహం కొనసాగుతోంది. మూడోరోజు గురువారం వేలాది మంది భక్తులు గోదావరి ఒడిలో పవిత్ర స్నానాలు చేశారు. కంద కుర్తి మొదలు..పోచంపాడ్, తడపాకల్, గుమ్మిర్యాల, తుంగిని, ఉమ్మెడ సహా జిల్లాలో అన్ని ఘాట్ల వద్ద భక్తుల సందడి కనిపించింది. హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలతోపాటు మహారా ష్ర్ట, కర్ణాటక నుంచి భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి పుణ్యస్నానాలను ఆచరించి పునీతులయ్యారు. పుష్కరఘాట్లలో సౌకర్యాలను కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అధికారులతో సమీక్షించారు. కందకుర్తి, పోచంపాడ్, తుంగిని తదితర ఘాట్లను సందర్శించిన ఆయన మొదటి, రెండోరోజు ఎదురైన సమస్యలను గుర్తించి భక్తులకు తగిన ఏర్పాట్లను చేశారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తడపాకల్ను సందర్శించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కుటుంబసభ్యులతో ఎస్ఆర్ఎస్పీ వద్ద పవిత్ర స్నానమాచరించారు. కాగా, శుక్రవారం నుంచి ఆదివారం వరకు వరుసగా మూడు రోజులు సెలవులు ఉన్నందున పుష్కరఘాట్లకు భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ అధికారులను అప్రమత్తం చేశారు. ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి బం దోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. వాచ్టవర్ల ద్వారా వీవీఐపీ, వీఐపీల సందర్శన, భక్తుల సౌకర్యాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. శుక్రవారం నుంచి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున పోలీసు అధికారులు, ఘాట్ ఇన్‌చార్జ్‌లు, ప్రత్యేక విభాగాలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ప్రధాన పుష్కరఘాట్ కందకుర్తిలో నీటి సమస్య ఏర్పడింది. పుష్కరాల కోసం శ్రీరాంసాగర్ నుంచి పోచంపాడ్, సావెల్ తదితర ఘాట్లకు నీటి విడుదల చేపడుతుండటంతో ప్రాజెక్ట్ నుంచి నీటి మట్టం వేగంగా తగ్గుతోంది. నిరంతరం మూడు వేల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి వదులుతున్నారు. నిజామాబాద్‌తోపాటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి సరస్వతీ కాలువ ద్వారా 800 క్యూసెక్కులు వదులుతుండగా, గురువారం సాయంత్రం వరకు ప్రాజెక్ట్ నీటి మట్టం 2.5 అడుగుల మేరకు తగ్గిందని అధికారులు వెల్లడించారు. ఎస్ఆర్ఎస్పీ నీటి మట్టం 1,091 అడగులు కాగా, గురువారం సాయంత్రానికి 1055.30 అడుగుల నీరు ఉంది.