లైంగికపరంగా నేనేమిటో చెప్పలేను: హీరోయిన్‌ | Kristen Stewart refuses to define her sexuality | Sakshi
Sakshi News home page

లైంగికపరంగా నేనేమిటో చెప్పలేను: హీరోయిన్‌

Published Tue, May 10 2016 3:51 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

లైంగికపరంగా నేనేమిటో చెప్పలేను: హీరోయిన్‌ - Sakshi

లైంగికపరంగా నేనేమిటో చెప్పలేను: హీరోయిన్‌

హాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌, 'ట్విలైట్‌' కథనాయిక క్రిస్టన్ స్టెవార్ట్‌ తన లైంగికత గురించి చెప్పేందుకు నిరాకరించింది. లైంగికపరంగా తాను ఏమిటో నిర్వహించించడం కష్టమని ఈ భామ చెప్పుకొచ్చింది. తాను మనిషినని, లైంగికపరంగా ఆడో-మగో చెప్పలేనని పేర్కొంది.

గతంలో రాబర్ట్ పాటిన్సన్‌తో డేటింగ్ చేసిన ఈ అమ్మడు.. నిన్నమొన్నటి వరకు పలువురు గర్ల్‌ఫ్రెండ్స్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. మొన్నటివరకు గాయనీ స్టెఫానీ 'సోకో'తో ప్రణయబంధాన్ని కొనసాగించింది. తాజాగా ఆమెతో కూడా తెగదెంపులు చేసుకున్న ఈ బ్యూటీ సెక్సువాలిటీ పరంగా తనపై ఓ ముద్రవేసుకోవడం ఇష్టంలేదని చెప్తోంది.

'నేను ఏమిటి అన్నది నేను ఇప్పుడే చెప్పలేను. అది మీకు అర్థం కాకపోతే దానిని వివరించి చెప్పేందుకు నా దగ్గర అంత టైమ్‌ లేదు. యాక్సెప్టెన్సీ ఉన్నంతవరకు ఎలా ఉన్నా పర్వాలేదు. మిమ్మల్ని మీరు వెంటనే నిర్వహించుకోవాల్సిన అవసరం లేదు' అని క్రిస్టెన్ తెలిపింది. తాజాగా 'వెరైటీ' మ్యాగజీన్‌ కవర్ పేజీపై పోజిచ్చిన ఈ అమ్మడు పలువురికి ఆదర్శంగా ఉండాలని గతంలో అనుకొనే దానిని, కానీ, ఇప్పుడా అవసరం లేదని గుర్తించానని, అందుకే తనపై ఓ ముద్ర వేసుకొని జీవించడం ఇష్టం లేదని ఆమె తెలిపింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement