రామ్‌యుగ్‌ | Kunal Kohli adapts Ramayana for big screen | Sakshi
Sakshi News home page

రామ్‌యుగ్‌

Published Fri, Aug 17 2018 1:07 AM | Last Updated on Fri, Aug 17 2018 1:07 AM

Kunal Kohli adapts Ramayana for big screen - Sakshi

కునాల్‌ కోహ్లీ

రామాయణం నేపథ్యంలో సౌత్‌లోనూ, నార్త్‌లోనూ చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా బాలీవుడ్‌లో మరో సినిమా రూపొందడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కునాల్‌ కోహ్లీ దర్శకత్వంలో ‘రామ్‌యుగ్‌’ అనే టైటిల్‌తో రామాయణం బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా తెరకెక్కనుందని టాక్‌. ఇంతకుముందు ‘హమ్‌ తుమ్, ఫనా, తేరీ మేరీ కహానీ’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు కునాల్‌.

ఈ సినిమాకు కమలేష్‌ పాండే స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారట. బాలీవుడ్‌ ద్వయం సాజిద్‌–వాజిద్‌ సంగీతం అందించనున్నారు. నటీనటులను తర్వలో అనౌన్స్‌ చేయాలనుకుంటున్నారు. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణుడు పాత్రల్లో ఏ బాలీవుడ్‌ తారలు నటించబోతున్నారన్నది ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. అంతేకాదు.. ఈ సినిమాని ఒక పార్ట్‌గా కాకుండా  సిరీస్‌లుగా తీసి రిలీజ్‌ చేస్తారనే వార్తలు బాలీవుడ్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement