
చకచకా 'గోపాల గోపాల' సినిమా షూటింగ్
పవన్ కల్యాణ్, వెంకటేశ్ నటిస్తున్న 'గోపాల గోపాల' సినిమా విడుదలకు గట్టిగా రెండు వారాల సమయం కూడా లేదు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే.. ఇంకా కొంత షూటింగ్ మిగిలిపోవడంతో దాన్ని చకచకా పూర్తిచేసే ప్రయత్నాల్లో చిత్ర యూనిట్ ఉంది. హైదరాబాద్లో ఈ మిగిలిన షూటింగ్ జరుగుతోంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ మీద కొన్ని కీలక సన్నివేశాలు మిగిలి ఉన్నాయి. వాటిని ఈ షెడ్యూల్లో పూర్తిచేసేస్తారని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా విడుదల చేస్తామని గట్టి నమ్మకంతో ఉన్నారు.
హిందీలో బాగా హిట్టయిన ఓ మై గాడ్ సినిమా రీమేక్గా వెంకటేశ్, పవన్ కల్యాణ్లతో గోపాల గోపాల చేస్తున్నారు. వెంకటేశ్ భార్య పాత్రను శ్రియ పోషిస్తోంది. శరత్ మరార్, సురేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో మిథున్ చక్రవర్తి తొలిసారిగా తెలుగు తెరమీద దర్శనం ఇవ్వబోతున్నారు.