సూపర్‌స్టార్‌ పాత్రలో లారెన్స్ | Laurens In the role of superstar | Sakshi
Sakshi News home page

సూపర్‌స్టార్‌ పాత్రలో లారెన్స్

Published Wed, Dec 21 2016 1:44 AM | Last Updated on Mon, Sep 4 2017 11:12 PM

సూపర్‌స్టార్‌ పాత్రలో లారెన్స్

సూపర్‌స్టార్‌ పాత్రలో లారెన్స్

సూపర్‌స్టార్‌ నటించిన పాత్రను మరో నటుడు పోషించడం కత్తిమీద సాము లాంటిదే. ఈ తరం హీరోల్లో చాలా మందికి అలాంటి ఆశ ఉన్నా సాహసం చేయడానికి వెనుకాడుతున్నారన్నది వాస్తవం. ఆ మధ్య అజిత్‌ బిల్లా చిత్రంలో నటించి సక్సెస్‌ అయ్యారు. తాజాగా రజనీకాంత్‌ వీరాభిమాని లారెన్స్ అలాంటి ప్రయత్నం చేయడానికి రెడీ అవుతున్నారు. ఆయన సాహసం చేయనున్న చిత్రం మన్నన్. రజనీకాంత్, విజయశాంతి, కుష్బూ హీరోహీరోయిన్లుగా నటించిన మన్నన్ చిత్రానికి పి.వాసు దర్శకుడు. శివాజీ ఫిలింస్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం 1992లో విడుదలై ఘనవిజయాన్ని సాధించింది. అంతే కాదు తెలుగులో చిరంజీవి, నగ్మా, వాణివిశ్వనాథ్‌ హీరోహీరోయిన్లుగా రీమేక్‌ అయ్యి అక్కడా సంచలన విజయాన్ని అందుకుంది.

నిజానికి ఇది కన్నడంలో తెరకెక్కిన అనురాగ అరళిదు చిత్రానికి రీమేక్‌ అన్నది గమనార్హం. ఆ చిత్రాన్ని దర్శకుడు పి.వాసు ఇప్పుడు రీమేక్‌ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ కాలానికి తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు, చేర్పులు చేసి స్క్రిప్ట్ట్‌ను రెడీ చేసినట్లు సమాచారం. ఇందులో రజనీకాంత్‌ పాత్రలో లారెన్స్ నటించనున్నారు. ఇప్పటికే పి.వాసు దర్శకత్వంలో లారెన్స్ శివగంగ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ సమయంలోనే మన్నన్  చిత్ర రీమేక్‌ గురించి పి.వాసు లారెన్స్ కు చెప్పడంతో ఆయన నటించడానికి ముందుకు వచ్చారని తెలిసింది. విజయశాంతి పాత్రలో నయనతార, కుష్బూ పాత్రల్లో నిత్యామీన్ ను నటింపచేయడానికి చర్చలు జరుగుతున్నాయి. ఇక వేళ నయనతార నటించకపోతే ఆ పాత్రలో నటి త్రిషను ఎంపిక చేయనున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement