Mannan
-
చదువుకున్న మారాజు
దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, చాలాచోట్ల ఇంకా రాచరికాలు లాంఛనప్రాయంగా మిగిలి ఉన్నాయి. పలుచోట్ల రాజ సంస్థానాల వారసులకు పట్టాభిషేకాల వంటి లాంఛనాలు కొనసాగుతుండటం మనకు తెలిసిన సంగతే! నాగరిక రాజ్యాలు, సంస్థానాల వ్యవహారాలు సరే, దక్షిణాదిన ఏకైక ఆదివాసీ రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి రాజు కూడా ఉన్నాడు.అదే కేరళలోని మన్నన్ రాజ్యం. పుష్కరం కిందట ఆ రాజ్యానికి కొత్త రాజు వచ్చాడు. ఆయన పట్టభద్రుడు. ఢిల్లీలో ఇటీవల జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు ప్రభుత్వ ఆహ్వానంపై హాజరైన ఈ చదువుకున్న మారాజు కథా కమామిషూ..కేరళలోని ఇడుక్కి జిల్లా కట్టప్పన గ్రామానికి చేరువలో ఉంటుంది మన్నన్ రాజ్యం. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక దక్షిణాదిన మిగిలి ఉన్న ఏకైక ఆదివాసీ రాజ్యం ఇది. ఈ రాజ్యానికి 2012లో కొత్త రాజు వచ్చాడు. ‘రామన్ రాజమన్నన్(Raman Rajamannan)’గా పట్టాభిషిక్తు డయ్యాడు. అతడి అసలు పేరు బిను. అతడికి ముందున్న రాజు ‘అరియన్ రాజమన్నన్’. అతడు 29 ఏళ్ల వయసులోనే చనిపోయాడు. అరియన్ రాజమన్నన్కు ముందున్న రాజు ‘దేవన్ రాజమన్నన్’ తన 54వ ఏట చనిపోయాడు. ఇప్పటి రాజు రామన్ రాజమన్నన్ అలియాస్ బిను మన్నన్ రాజ్యానికి పదిహేడో రాజు. అతడికి ముందున్న రాజులందరూ నిరక్షరాస్యులే! రామన్ రాజమన్నన్ ఎర్నాకుళం మహారాజా కాలేజీ నుంచి ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తిచేశాడు.మన్నన్ రాజ్యానికి ఎవరు రాజైనా, వారికి ‘రాజమన్నన్’ గౌరవ బిరుదనామం వస్తుంది. మన్నన్ తెగ ప్రజలది మాతృస్వామ్య సమాజం. దేశ పాలనా యంత్రాంగానికి లోబడే ఈ రాజ్యం నడుస్తోంది. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు వస్తాయి. ఇడుక్కి జిల్లావ్యాప్తంగా 62 చోట్ల విస్తరించి ఉన్న మూడువందలకు పైగా మన్నన్ తెగ కుటుంబాల మంచిచెడ్డలను ప్రస్తుత రాజు రామన్ రాజమన్నన్ చూసుకుంటారు. ఈ రాజుకు ఒక ఆస్థానం, ఆ ఆస్థానంలో తొమ్మిదిమంది మంత్రులు ఉంటారు. ప్రజల పెళ్లిళ్లు, విడాకులు సహా తెగకు సంబంధించిన అంతర్గత సమస్యలు, బయటి నుంచి తెగ ప్రజలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం రాజు బాధ్యతే! రాజుకు హఠాత్తుగా అనారోగ్యం వాటిల్లినా, రాజు మరణించినా, కొత్తరాజు వచ్చేంత వరకు రాజ్యభారాన్ని మంత్రులు చూసుకుంటారు. మన్నన్ ప్రజలు రాజును తమ పాలకుడిగానే కాకుండా, ఆధ్యాత్మిక మార్గదర్శిగా కూడా గౌరవిస్తారు. ఒక రాజు, అతడికి ఒక ఆస్థానం అంటే భారీగా ఊహించుకుంటారేమో! ఈ రాజుకు, ఆయన ఆస్థానానికి భారీ భవంతులు, రాజప్రాసాదాలూ ఉండవు. మామూలు పక్కా ఇల్లే ఆయన నివాసం, ఆస్థానం.రామన్ రాజమన్నన్ భార్య బినుమాల్ మన్నన్ తెగప్రజలకు రాణి. వీరి కూతురు అర్చన యువరాణి. మన్నన్ ప్రజల్లో ఎక్కువమంది వ్యవసాయ పనులు చేసుకుంటారు. వీరిలో కొందరు అటవీశాఖలో చిన్న చిన్న ఉద్యోగాల్లో కుదురుకున్నారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు రామన్ రాజమన్నన్ సకుటుంబంగా హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును స్వయంగా కలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేడుకలకు ఆహ్వానం అందుకున్న తొలి మన్నన్ రాజుగా ఆయన దేశ ప్రజలకు కనిపించారు. రిపబ్లిక్ డే వేడుకలు ముగిశాక రాజదంపతులు ఢిల్లీలోని ఇతర పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి జనవరి 31 వరకు అక్కడే ఉన్నారు. వారు ఫిబ్రవరి 2న తిరిగి తమ రాజ్యానికి చేరుకున్నారు. వీరి ప్రయాణ ఖర్చులను గిరిజనాభివృద్ధి శాఖ పెట్టుకుంది. మన్నన్‌ల చరిత్ర!ఏడు వందల ఏళ్ల క్రితం పాండ్య, చోళ రాజ్యాల మధ్య యుద్ధం జరిగింది. యుద్ధంలో పాండ్యరాజు చిరై వర్మన్ ఓడిపోయాడు. కొద్దిమందిని వెంటబెట్టుకుని తన రాజ్యం నుంచి పారిపోయి, ఇప్పటి ఇడుక్కి జిల్లాలోని అటవీ ప్రాంతానికి వచ్చి, కొత్త రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. అదే ఈ మన్నన్ రాజ్యమని స్థానిక మన్నన్ తెగ ప్రజలు చెబుతారు.విద్యను అందించడమే లక్ష్యంరాజుగా నా ప్రజలందరికీ విద్యను అందించడమే నా ప్రధాన లక్ష్యం. విద్యతోనే ఆదివాసీల జీవితాలు మెరుగుపడతాయి. నేటితరానికి ఈ అవగాహనను కల్పించడం ద్వారానే పేదరికాన్ని నిర్మూలించగలం – రామన్ రాజమన్నన్పిల్లల్ని చదివించటం అంటే వారికి రాయల్ లైఫ్‌ను ఇవ్వటమే. – రాజమన్నన్ -
హిజ్బుల్ టాప్ కమాండర్ వనీ హతం
శ్రీనగర్: నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు కశ్మీర్ లోయలో మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో గురువారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఆ సంస్థ టాప్ కమాండర్ మనాన్ బషీర్ వనీతో పాటు అతని అనుచరుడు హతమయ్యారు. 27 ఏళ్ల వనీ పీహెచ్‌డీని మధ్యలో మానేసి మిలిటెన్సీ బాటపట్టాడు. ఈ ఎన్కౌంటర్లో మరణించిన మరో ఉగ్రవాదిని ఆషిక్ హుస్సేన్‌గా గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. మృతిచెందిన ఉగ్రవాదులకు గౌరవసూచకంగా శుక్రవారం బంద్ పాటించాలని వేర్పాటువాద నాయకులు పిలుపునిచ్చారు. లొంగిపొమ్మన్నా వినలేదు.. హంద్వారాలోని ఓ గ్రామంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారం అందడంతో భద్రతా దళాలు వెళ్లి అక్కడ గురువారం వేకువజాము నుంచే సోదాలు నిర్వహించాయి. ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు తొలుత భద్రతా దళాలపైకి కాల్పులు జరిపారని, దీనికి స్పందించిన భద్రతా దళాలు కూడా కాల్పులకు దిగినట్లు ఓ అధికారి తెలిపారు. ఇలా ఇరు పక్షాల మధ్య ఉదయం 11 గంటల వరకు కాల్పులు జరిగినట్లు వెల్లడించారు. మిలిటెంట్లు లొంగిపోవాలని పోలీసులు పలుమార్లు మైకు ద్వారా ప్రకటించినా ఎలాంటి ప్రయోజనంలేకపోయిందని అన్నారు. ఎన్కౌంటర్ ముగిశాక ఆ ఇంటి నుంచి వనీ, హుస్సేన్‌ల మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. అంత్యక్రియలకు 10వేల మంది: లోలాబ్ ప్రాంతంలోని టేకిపురా సమీపంలో ఉన్న వనీ స్వగ్రామంలో జరిగిన అతని అంత్యక్రియలకు సుమారు 10 వేల మంది హాజరయ్యారు. మరోవైపు, బషీర్ వనీ మరణవార్త తెలియగానే శ్రీనగర్‌లో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. కొన్ని ప్రాంతాల్లో భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వారు. శాంతి, భద్రతల సమస్య తలెత్తకుండా ఉత్తరకశ్మీర్‌లో అన్ని పాఠశాలలు, కళాశాలలను అధికారులు మూసేశారు. పుకార్లు, విద్వేష ప్రసంగాలు వ్యాపించకుండా ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ బంద్ పాటించాలని వేర్పాటువాద నాయకులు పిలుపునిచ్చారు. స్వీయపాలన కోసం పోరాడుతున్న ఓ భావి మేధావిని కోల్పోయామని మితవాద హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ చెప్పారు. వనీ ఎన్‌కౌంటర్‌పై జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కూడా విచారం వ్యక్తం చేశారు. పీహెచ్డీ వద్దని మిలిటెన్సీలోకి 2016లో బుర్హాన్ వనీ హతమైన తరువాత మిలిటెన్సీ వైపు ఆకర్షితులైన విద్యావంతుల్లో బషీర్ వనీ ఒకడు. ముందునుంచి చదువుల్లో చురుకుగా ఉన్న బషీర్ వనీ ప్రతిష్టాత్మక సైనిక్ స్కూల్లో 11, 12వ తరగతులు పూర్తిచేశాడు. మెరిట్ విద్యార్థిగా పాఠశాల, కళాశాల రోజుల్లో ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు. ఎన్సీసీ క్యాడెట్‌గా పంద్రాగస్టు, రిపబ్లిక్ డే కవాతుల్లో కూడా పాల్గొన్నాడు. 2010, 2016లో కశ్మీర్ లోయలో చెలరేగిన తీవ్ర నిరసనల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అలాంటి వాడు, అలీగఢ్ యూనిర్సిటీలో పీహెచ్డీ చదువుతుండగా 2017 చివరన దక్షిణ కశ్మీర్‌కు చెందిన కొందరు విద్యార్థులతో ఏర్పడిన పరిచయంతో మిలిటెన్సీలో చేరాడు. ఈ ఏడాది జనవరి 3న అలీగఢ్ వర్సిటీని వదిలి వెళ్లాడు. అతని పేరు ఇప్పటికీ వర్సిటీ అధికారిక వెబ్సైట్లో కనిపిస్తోంది. భూగర్భశాస్త్రంలో పీహెచ్డీ చదువుతున్న వనీకి భోపాల్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ‘బెస్ట్ పేపర్ ప్రజెంటేషన్’ అవార్డు కూడా దక్కింది. -
సూపర్‌స్టార్ పాత్రలో లారెన్స్
సూపర్‌స్టార్ నటించిన పాత్రను మరో నటుడు పోషించడం కత్తిమీద సాము లాంటిదే. ఈ తరం హీరోల్లో చాలా మందికి అలాంటి ఆశ ఉన్నా సాహసం చేయడానికి వెనుకాడుతున్నారన్నది వాస్తవం. ఆ మధ్య అజిత్ బిల్లా చిత్రంలో నటించి సక్సెస్ అయ్యారు. తాజాగా రజనీకాంత్ వీరాభిమాని లారెన్స్ అలాంటి ప్రయత్నం చేయడానికి రెడీ అవుతున్నారు. ఆయన సాహసం చేయనున్న చిత్రం మన్నన్. రజనీకాంత్, విజయశాంతి, కుష్బూ హీరోహీరోయిన్లుగా నటించిన మన్నన్ చిత్రానికి పి.వాసు దర్శకుడు. శివాజీ ఫిలింస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం 1992లో విడుదలై ఘనవిజయాన్ని సాధించింది. అంతే కాదు తెలుగులో చిరంజీవి, నగ్మా, వాణివిశ్వనాథ్ హీరోహీరోయిన్లుగా రీమేక్ అయ్యి అక్కడా సంచలన విజయాన్ని అందుకుంది. నిజానికి ఇది కన్నడంలో తెరకెక్కిన అనురాగ అరళిదు చిత్రానికి రీమేక్ అన్నది గమనార్హం. ఆ చిత్రాన్ని దర్శకుడు పి.వాసు ఇప్పుడు రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ కాలానికి తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు, చేర్పులు చేసి స్క్రిప్ట్ట్ను రెడీ చేసినట్లు సమాచారం. ఇందులో రజనీకాంత్ పాత్రలో లారెన్స్ నటించనున్నారు. ఇప్పటికే పి.వాసు దర్శకత్వంలో లారెన్స్ శివగంగ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే మన్నన్ చిత్ర రీమేక్ గురించి పి.వాసు లారెన్స్ కు చెప్పడంతో ఆయన నటించడానికి ముందుకు వచ్చారని తెలిసింది. విజయశాంతి పాత్రలో నయనతార, కుష్బూ పాత్రల్లో నిత్యామీన్ ను నటింపచేయడానికి చర్చలు జరుగుతున్నాయి. ఇక వేళ నయనతార నటించకపోతే ఆ పాత్రలో నటి త్రిషను ఎంపిక చేయనున్నట్లు సమాచారం.