సూర్య '24' బాలీవుడ్ రీమేక్..? | leading stars for 24s bollywood remake | Sakshi
Sakshi News home page

సూర్య '24' బాలీవుడ్ రీమేక్..?

Published Thu, Mar 31 2016 1:58 PM | Last Updated on Sun, Sep 3 2017 8:57 PM

leading stars for 24s bollywood remake

ఈ వేసవిలో రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమాల్లో భారీ అంచనాలున్న సినిమా 24. సూర్య హీరోగా తన సొంతం నిర్మాణ సంస్థ ద్వారా తెరకెక్కుతున్న ఈ సినిమాకు విక్రమ్ కుమార్ దర్శకుడు. సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మూడు విభిన్న పాత్రల్లో నటిస్తుండగా సమంత, నిత్యా మీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగు లోనూ ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ తో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేయాడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అంతేకాదు బాలీవుడ్ లో కూడా ఈ సినిమాను సూర్య స్వయంగా నిర్మించేదుకు రెడీ అవుతున్నాడు. హృతిక్ రోషన్ లేదా సల్మాన్ ఖాన్ లలో ఒకరిని హీరోగా ఒప్పించి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు సూర్య.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement