చిన్న కోరిక...పెద్ద మనసు!
నిత్యామీనన్‌ది భిన్నమైన మనస్తత్వం. ఈ కారణంగానే పలు సందర్భాల్లో వార్తల్లో వ్యక్తిగా నిలిచారామె. ఇటీవల ఓ సినిమా షూటింగ్‌లో నిత్య వింత చర్య అందర్నీ ఆశ్చర్యానికి లోను చేసిందని సమాచారం. వివరాల్లోకెళ్తే... లొకేషన్లో ట్రాలీ నెట్టాలనే వింత కోరిక నిత్యకు కలిగిందట. అయితే... సదరు విభాగం వారు మాత్రం అందుకు ససేమిరా అన్నారట. దాంతో బుంగమూతి పెట్టుకొని ఓ మూల కూర్చున్నారట నిత్య. చేసేదేం లేక వారే దిగొచ్చి.. ‘ట్రాలీ నెట్టండి.. అయితే... రాత్రికి మా పార్టీకి అయ్యే అయిదు వేల రూపాయల ఖర్చును మీరే భరించాలి’ అని నిబంధన విధించారట. ‘ఓకే’ అని ఉత్సాహంగా ట్రాలీ నెట్టేశారట నిత్య. వెంటనే ఏటీఎం నుంచి ఓ ఇరవై వేలు తెప్పించి వారికిచ్చి ‘పార్టీని ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేయండి’ అన్నారట సంతృప్తిగా నవ్వుతూ. చిన్న పిల్ల లాంటి ఆ మనస్తత్వం చూసి యూనిట్ సభ్యులందరూ నవ్వుకున్నారని సమాచారం..