'ఐ యామ్ వెరీ గుడ్ గర్ల్' | little soldiers kavya latest video by her brother goes viral | Sakshi
Sakshi News home page

'ఐ యామ్ వెరీ గుడ్ గర్ల్'

Published Wed, Dec 2 2015 12:44 PM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

'ఐ యామ్ వెరీ గుడ్ గర్ల్' - Sakshi

'ఐ యామ్ వెరీ గుడ్ గర్ల్'

హైదరాబాద్: 'ఐ యామ్ వెరీ గుడ్ గర్ల్' అంటూ తెలుగు ప్రేక్షకుల మదిలో అపురూపంగా మిగిలిపోయిన 'లిటిల్ సోల్జర్స్' పాప కావ్య గుర్తుందా. చెంపకు చారడేసి కళ్లతో అమాయకంగా 'ఇది నిజం విమానమా?' అంటూ ప్రశ్నించి అభిమానుల గుండెల్లో నిలిచిన ఆ బుజ్జి బంగారం ఇపుడు మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఆ నాన్న కూచి ఇపుడు పెళ్లి చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్రీకరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మళ్లీ ఇన్నేళ్ళ తరువాత 'ఐ యామ్ వెరీ గుడ్ గర్ల్' పాటను వినూత్నంగా చిత్రీకరించిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు అలనాటి అపురూప గారాల పాపాయేనా ఆ కావ్య అని తెగ మురిసిపోతున్నారు.

కావ్య సంగీత్ వేడుక సందర్భంగా ఆమె సోదరుడు ఈ వీడియోను రూపొందించారు. లిటిల్ సోల్జర్స్ చిత్రంలో హైలైట్ గా నిలిచిన 'ఐ యామ్ వేరీ గుడ్ గర్ల్' పాట నేపథ్యంలోనే ఈ వీడియో రూపొందించారు. సినిమాలో కావ్య అన్నయ్యగా నటించిన బాలాదిత్య సహా ఆమె సొంత తల్లిదండ్రులు కూడా ఈ వీడియోలో నటించడం విశేషం.

1996, ఫిబ్రవరిలో విడుదలైన 'లిటిల్ సోల్జర్స్' ఘన విజయం సాధించింది. రమేశ్ అరవింద్, హీరా జంటగా నటించిన ఈ సినిమా పిల్లలను ఎంతగానో ఆకట్టుకుంది. గుణ్ణం గంగరాజు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో హిట్ గా నిలిచిన 'ఐ యామ్ వెరీ గుడ్ గర్ల్' పాటతో కూడిన తాజా వీడియో మరోసారి సంచలనం సృష్టిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓసారి చూసేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement