
లాక్‌డౌన్ వల్ల సెలబ్రిటీలందరూ ఇంట్లోనే సమయాన్ని గడుపుతున్నారు. బుక్స్ చదవడం, వంటలు చేయడం, ఆన్‌లైన్ క్లాసుల ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవడం వంటివి చేస్తున్నారు. మరి.. ‘ఈ లాక్‌డౌన్ మీకు ఏం నేర్పించింది’ అనే ప్రశ్నను హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ముందుంచితే...‘‘నా జీవితం గురించి తెలుసుకున్నాను. జీవితం చాలా చిన్నదని అర్థం చేసుకున్నాను. అందుకే మన జీవితంలోని ప్రతి రోజునీ సంతృప్తికరంగా జీవించాలి. మనకు ప్రతిరోజూ విలువైనదే. అలాగే మనం ప్రకృతిని మెచ్చుకోవాలి. ప్రకృతి వల్లే మానవ మనుగడ సాధ్యపడుతుందనిపిస్తోంది. అందుకే ప్రకృతిని మనం కాపాడుకోవాలి’’ అని పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే... జాన్ అబ్రహాం ‘ఎటాక్’లో ఒక హీరోయిన్‌గా నటిస్తున్నారు జాక్వెలిన్. ఇందులో రకుల్‌ప్రీత్ సింగ్ మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment