realize
-
జీవితం చాలా చిన్నది
లాక్డౌన్ వల్ల సెలబ్రిటీలందరూ ఇంట్లోనే సమయాన్ని గడుపుతున్నారు. బుక్స్ చదవడం, వంటలు చేయడం, ఆన్లైన్ క్లాసుల ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవడం వంటివి చేస్తున్నారు. మరి.. ‘ఈ లాక్డౌన్ మీకు ఏం నేర్పించింది’ అనే ప్రశ్నను హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ముందుంచితే...‘‘నా జీవితం గురించి తెలుసుకున్నాను. జీవితం చాలా చిన్నదని అర్థం చేసుకున్నాను. అందుకే మన జీవితంలోని ప్రతి రోజునీ సంతృప్తికరంగా జీవించాలి. మనకు ప్రతిరోజూ విలువైనదే. అలాగే మనం ప్రకృతిని మెచ్చుకోవాలి. ప్రకృతి వల్లే మానవ మనుగడ సాధ్యపడుతుందనిపిస్తోంది. అందుకే ప్రకృతిని మనం కాపాడుకోవాలి’’ అని పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే... జాన్ అబ్రహాం ‘ఎటాక్’లో ఒక హీరోయిన్గా నటిస్తున్నారు జాక్వెలిన్. ఇందులో రకుల్‌ప్రీత్ సింగ్ మరో హీరోయిన్గా నటిస్తున్నారు. -
ఎన్నాళ్లో వేచిన ఉదయం
సాక్షి, ఆరిలోవ (విశాఖ తూర్పు) : సత్ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలు విశాఖ కేంద్ర కారాగారం నుంచి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. సంవత్సరాలు తరబడి నాలుగు గోడల మధ్య గడుపుతూ కుటుంబీకులకు దూరంగా ఉన్న వారు ఎట్టకేలకు ఆదివారం విముక్తి పొందారు. రిపబ్లిక్ డే సందర్భంగా వచ్చిన క్షమాబిక్ష జీవోకి ఇప్పుడు మోక్షం కలిగింది. ఈ ఏడాది జనవరి 24న క్షమాభిక్ష జీవో విడుదలైంది. దీంతో ఆ జీవో ప్రకారం ఇక్కడి జైలు అధికారులు అర్హులైన జీవిత ఖైదీల జాబితా తయారుచేసి జైల్ శాఖ ఉన్నతాధికారులకు పంపించారు. అప్పటి నుంచి వీరంతా ఎప్పుడు విడుదలవుతామా అంటూ ఎదురు చూశారు. రిపబ్లిక్ డే, ఉగాదికి విడదులవుతామని ఆశించారు. ఆ రెండు గడువులు దాటిపోయాయి. ఎట్టకేలకు ఆ ఖైదీలకు ఆదివారం మోక్షం కలిగింది. కానీ జైలు అధికారులు పంపించిన జాబితాలోని నలుగురిని ఉన్నతాధికారులు అనర్హులుగా గుర్తించి విడదులైన జాబితా నుంచి వారి పేర్లు తొలగించారు. ప్రభుత్వం క్షమాభిక్షపై రాష్ట్రంలో విడుదల చేసిన 49 మంది జీవిత ఖైదీలలో ఇక్కడి నుంచి 13 మందికి విముక్తి కలిగింది. దీంతో మధ్యాహ్నం 1 గంటకు వారంతా ఆనందోత్సాహాలతో జైలు నుంచి బయట ప్రపంచంలో అడుగుపెట్టారు. వీరిలో ఓ మహిళా ఖైదీ తన రెండేళ్ల కుమార్తెతో విడుదల కావడం విశేషం. విడుదలైన వారిలో విశాఖపట్నంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, కడప జిల్లాలకు చెందిన వారున్నారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన వారు 9 మంది, విజయనగరం జిల్లాకు చెందిన వారు ఇద్దరు, శ్రీకాకుళం, కడప జిల్లాలకు చెందిన వారు చెరో ఒక్కరు చొప్పున ఉన్నారు. క్షమాబిక్ష జీవో నిబంధనల ప్రకారం వీరందరూ రూ.50వేలు బ్యాండు పూచీకత్తుపై విడుదలయ్యారు. ప్రతి మూడు నెలలకు ఓసారి వీరంతా సంబంధిత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంతకం చేయాల్సి ఉంది. కొబ్బరికాయలు కొట్టిన ఖైదీలు విడుదలైన ఆనందంలో ఖైదీలు జైలు ద్వారం వద్ద కొబ్బరికాయలు కొట్టారు. చెప్పులు పక్కన విడిచి కొబ్బరికాయ కొట్టి ప్రతి ఒక్కరూ జైలుకు దండం పెట్టారు. ఇది ఒక దేవాలయం లాంటిదని, మాకు జీవిత పాఠం నేర్పిందని, బాహ్యప్రపంచంలో నీతిగా బతుకుతామంటూ దండం పెట్టుకొన్నారు. విడుదలైన జీవిత ఖైదీలు వీరే విశాఖపట్నం జిల్లా నుంచి జి.శ్రీనివాస్(నాతవరం), ఎం.అప్పారావు (జి.మాడుగుల), ఎస్.సుబ్బారావు(పెదబయిలు), ఎన్.అప్పన్న (నాతవరం), ఎన్.శ్రీను(నాతవరం), ఆర్.అప్పనాయుడు(అచ్చుతాపురం), ఎ.నాయుడు(మునగపాక), బి.గోవిందరాజు(గోపాలపట్నం), ఆర్.శ్యామల(గాజువాక) విడుదలయ్యారు. విజయనగరం జిల్లా వి.టి.అగ్రహారం రెడ్డి వీధికి చెందిన జి.కృష్ణ, పెదసాము ప్రాంతానికి చెందిన ఆర్.సీతారాం, శ్రీకాకుళం జిల్లా గట్లభద్రకు చెందిన ఎం.బాబూరావు, కడప జిల్లాకు చెందిన ఎస్.రవికుమార్ విడుదలయ్యారు. మళ్లీ నేరం చేస్తే జీవితాంతం జైలులోనే జైలు నుంచి విడుదలైన జీవిత ఖైదీలకు డిప్యూటీ సూపరింటెండెంట్ వేంకటేశ్వర్లు నిబంధనలు వివరించారు. క్షమాభిక్ష జీవో ప్రకారం ఇప్పుడు విడుదలైన ఖైదీలు మళ్లీ నేరాలకు పాల్పడకూడదన్నారు. అలాంటి వారికి క్షమాభిక్ష రద్దయి జీవితాంతం జైలులోనే గడపాల్సి వస్తుందన్నారు. బయట ప్రపంచంలో గౌరవంగా జీవించాలని సూచించారు. విడుదలైన వారంతా సంబంధిత పోలీస్ స్టేషన్‌కు ప్రతి మూడు నెలలకు ఓసారి వెళ్లి సంతకం చేయాలన్నారు. ఇప్పుడు ఇక్కడ మిగిలిన శిక్ష ముగిసినంతవరకు పోలీస్ స్టేషన్లో మూడు నెలలకు ఓసారి సంప్రదించాల్సిందేనని సూచించారు. -
గేట్లెత్తితేనే కల సాకారమైనట్లా?
- ప్రాజెక్టులకు ఆద్యుడు వైఎస్ఆర్ - పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి హితవు కర్నూలు(ఓల్డ్‌సిటీ): గేట్లెత్తినంత మాఽత్రాన కల సాకారమైనట్లు చంద్రబాబు భావించడం విడ్డూరంగా ఉందని.. ప్రాజెక్టులకు ఆద్యుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అనే విషయం ప్రజలకు తెలియంది కాదని పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పాణ్యం శాసన సభ్యురాలు గౌరు చరితారెడ్డి, నందికొట్కూరు శాసనసభ్యుడు ఐజయ్య, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య, కోడుమూరు మాజీ శాసనసభ్యుడు మురళీకృష్ణలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ హయాంలోనే 90 శాతం పూర్తయిన ప్రాజెక్టులను ప్రారంభించి కల నిజమైందనడంలో అర్థం లేదన్నారు. ఐటీ రంగానికి సంబంధించి ఏపీ దేశంలోనే మూడో స్థానంలో ఉండేదని, చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలన తర్వాత రాష్ట్రానికి ఐదో స్థానం లభించిందన్నారు. అయితే చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. మిగతా పార్టీలను బ్రేక్‌చేసి, మీ పార్టీని మేక్ చేస్తున్నారా, అవినీతి పునాదిపై రాజధాని కడుతున్నారా అంటూ ‘ఇండియాటుడే’ ప్రశ్నిస్తే ప్రతిపక్ష నేత అనే గౌరవం కూడా లేకుండా ‘హూ ఈజ్ దట్ ఫెలో’ అనడం చంద్రబాబు సంస్కారానికి నిదర్శనమన్నారు. పట్టుదల, దూరదృష్టికి అర్థం చెప్పిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, ఆయన స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కులమతాలకు తావులేదన్నారు. రైతులతోనే దేశం సుభిక్షం.. ఎక్కడైతే రైతులు సుభిక్షంగా ఉంటారో ఆ దేశం సిరిసంపదలతో తులతూగుతుందని నమ్మి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞానికి శ్రీకారం చుట్టారని పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు జిల్లాపై చిన్నచూపు చూస్తున్నారని, ఏ పనులూ ముందుకు వెళ్లడం లేదన్నారు. 2019లోనూ అధికార దాహం తీర్చుకునేందుకే అసత్యాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రెడ్డి సామాజిక వర్గంలో చిచ్చుపెట్టేందుకే జేసీ దివాకర్‌రెడ్డి చేత రెచ్చగొట్టే ప్రసంగాలు చేయిస్తున్నారన్నారు. ఇలాంటి కుయుక్తులపై ప్రజలు తిరగబడే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. ప్రాజెక్టులన్నీ వైఎస్ హయాంలోనివే.. ఒక్క ప్రాజెక్టుకూ శంకుస్థాపన చేయకపోగా వైఎస్ రాజశేఖరరెడ్డి 80, 90 శాతం పూర్తిచేసిన ప్రాజెక్టులకు గేట్లు ఎత్తి గొప్పలు చెప్పుకోవడం చంద్రబాబుకే చెల్లిందని నందికొట్కూరు శాసనసభ్యుడు ఐజయ్య అన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతలకు వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.120 కోట్లు మంజూరు చేశారని.. ఇందులో 4 పంపుల ద్వారా కేసీకి నీరు అందించాల్సి ఉండగా, చంద్రబాబు రెండింటినే ప్రారంభించారన్నారు. ఈ కారణంగా సాగునీరు 1000 క్యూసెక్కులు అందాల్సిన చోట 500లకే పరిమితమైందన్నారు. ముఖ్యమంత్రికి నిజంగా రాయలసీమపై, జిల్లాపై ప్రేమే ఉంటే సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలని సవాల్ చేశారు. మాటలతో మభ్యపెడుతున్నారు టీడీపీ పాలనలో మాటలతో మభ్యపెట్టడమే తప్పిస్తే అభివృద్ధి లేదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య అన్నారు. తమ నేత వైఎస్ జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణను చూసి చంద్రబాబుకు దిక్కుతోచడం లేదన్నారు. రౌడీ ఎంపీని దగ్గర పెట్టుకొని సంస్కారం లేకుండా మాట్లాడించడం సీఎం హోదాకు తగదన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తుడన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్, లీగల్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాటి పుల్లారెడ్డి, సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యం యాదవ్, మహిళా, మైనారిటీ విభాగాల జిల్లా అధ్యక్షులు శౌరి విజయకుమారి, ఫిరోజ్, విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు గోపినాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
అంత్య పుష్కరాలకు నిధులు కేటాయించాలి
గోదావరిఖని : గోదావరి అంత్య పుష్కరాలకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని బీజేఎంఎం జిల్లా అధ్యక్షుడు సుల్వ లక్ష్మీనర్సయ్య ఒక ప్రకటనలో కోరారు. ఆది పుష్కరాల సమయంలో ముందస్తుగా భక్తులకు ఏర్పాట్లు చేసి విజయవంతంగా నిర్వహించిన ప్రభుత్వం, అంత్య పుష్కరాలు సమీపిస్తున్నా నిధులు కేటాయించకపోవడం బాధాకరమని తెలిపారు. దేశంలో గోదావరినదికి మాత్రమే అంత్య పుష్కరాలు నిర్వహించే సాంప్రదాయాన్ని గర్వంగా భావించి తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పుష్కరఘాట్ల వద్ద భక్తులకు సౌకర్యాలు కల్పించాలని కోరారు. -
అమెరికా చిన్నారికి చైనా యూజర్ల సహకారం
ఆ చిన్నారి అందరిలాగే తానూ ఎంతో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందాలనుకుంది. అదీ... గ్రేట్ వాల్ కలిగిన చైనా దేశంలోనే ప్రసిద్ధిపొందిన వ్యక్తిగా మారాలనుకుంది. అయితే దురదృష్టం ఆమెను వెంటాడింది. ఓ మాయదారి రోగంతో బాధపడుతున్న ఆ ఎనిమిదేళ్ళ బాలిక జీవితానికి అంత సమయం లేకపోయింది. అందుకే తల్లిదండ్రులు ఆమె కోరిక తీర్చేందుకు సామాజిక మాధ్యమాల సహాయం కోరారు. ఫేస్ బుక్ లో తమకు సహకరించమని వేడుకున్నారు. దీనికి చైనా నెట్ వినియోగదారులు భారీగా స్పందించారు. అమెరికాలోని రోడే ఐల్యాండ్ వెస్లీ ప్రాంతానికి చెందిన డోరియన్ కు నాలుగేళ్ళ వయసులోనే చిన్నపిల్లల్లో చాలా అరుదుగా కనిపించే క్యాన్సర్ (ర్యాబ్డోమియోసర్కోమా) సోకింది. పసి వయసులోనే శరీరమంతా పాకిన ఆ జబ్బుకు వైద్యం లేదని ఇంటికి వెళ్ళిపొమ్మని వైద్యులు చెప్పేశారు. పది రోజుల తర్వాత బాధితురాలి తల్లి తన గారాలపట్టి కోరికతోపాటు... చిన్నారి డోరియన్ గురించి ప్రార్థనలు చేయమంటూ.. ఫేస్ బుక్ లో తన విన్నపాన్ని పోస్ట్ చేసింది. దీంతో చైనా ఇంటర్నెట్ యూజర్లు మరణానికి దగ్గరలో ఉన్న ఆ పసిప్రాణం కల నిజం చేసేందుకు నడుం బిగించారు. ముందుగా స్పందించిన జు జింగ్ అనే మహిళ స్వయంగా బీజింగ్ దగ్గరలోని గ్రేట్ వాల్ ప్రాంతానికి వెళ్ళి, తనతోపాటు ఇతరులను కూడా 'డి స్ట్రాంగ్' బోర్డుతో ఫోటోలు తీసి ఆ సందేశాన్ని ప్రపంచవ్యాప్తం చేసేందుకు ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ వీబోలో పోస్ట్ చేసింది. గ్రేట్ వాల్ ఎక్కినందుకు ఆమె ఓ మెడల్ ను కూడా పొందింది. మెడల్ తో పాటు ఆ ఫోటోలను డోరియన్ కుటుంబానికి పంపించింది. దీంతో గ్రేట్ వాల్ తో పాటు ఇతర చైనాలోని ప్రముఖ స్థలాల్లో 'డి స్ట్రాంగ్' అంటూ తీసుకున్న అనేక ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తాయి. అంతేకాదు చైనా ప్రభుత్వ వార్తా పత్రిక సిబ్బంది కూడా ఈ ప్రచారంలో పాలుపంచుకున్నారు. ఇంకేముందీ డి స్ట్రాంగ్ వీబోలో టాప్ టెన్ టాపిక్స్ లో ముందు నిలిచింది. దీంతో ఐదువేలకు పైగా లైక్ లు, 2,500 పైగా షేర్లు వచ్చిన కొన్ని ఫోటోలు, వీడియోలను వీబో అధికారికంగా వెల్లడించింది. తమకు అందిన సహకారానికి డోరియన్ తల్లి మెలీసా ఆశ్చర్యపోయింది. డోరియన్ ప్రపంచ ప్రజలనుంచి ఎంతో స్ఫూర్తిని పొందిందని, అందరికీ తమ కృతజ్ఞతలు తెలుపుతూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. పలువురు ప్రముఖులు కూడా ట్విట్టర్, ఫేస్ బుక్ లలో డోరియన్ కు ప్రోత్పాహాన్నిచ్చారు. వారికి మాత్రమే అనుమతి ఉండే హాలీడే రిసార్ట్ లో వీఐపీ ట్రీట్ మెంట్ తో ఆనందంగా గడిపేందుకు ఒకరోజు అవకాశం కల్పించారు. స్థానిక రోడే ఐల్యాండ్ గవర్నర్, ఆయన సెనేటర్లు కూడా డి స్ట్రాంగ్ ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.