అంత్య పుష్కరాలకు నిధులు కేటాయించాలి
Published Sun, Jul 17 2016 9:05 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM
గోదావరిఖని : గోదావరి అంత్య పుష్కరాలకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని బీజేఎంఎం జిల్లా అధ్యక్షుడు సుల్వ లక్ష్మీనర్సయ్య ఒక ప్రకటనలో కోరారు. ఆది పుష్కరాల సమయంలో ముందస్తుగా భక్తులకు ఏర్పాట్లు చేసి విజయవంతంగా నిర్వహించిన ప్రభుత్వం, అంత్య పుష్కరాలు సమీపిస్తున్నా నిధులు కేటాయించకపోవడం బాధాకరమని తెలిపారు. దేశంలో గోదావరినదికి మాత్రమే అంత్య పుష్కరాలు నిర్వహించే సాంప్రదాయాన్ని గర్వంగా భావించి తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పుష్కరఘాట్ల వద్ద భక్తులకు సౌకర్యాలు కల్పించాలని కోరారు.
Advertisement
Advertisement