
ప్చ్.. నా దురదృష్టం.. మళ్లీ చేస్తాలే
ముంబై: ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న సింగ్ ఈజ్ బ్లింగ్ చిత్రంలో నటించలేకపోతున్నందుకు తెగబాధపడిపోతోంది బాలీవుడ్ నటి కృతిసనన్. హీరో పాంటీ చిత్రంతో బాలీవుడ్ తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు తెలుగులో మహేశ్ బాబుతో కలిసి వన్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. అనంతరం బాలీవుడ్ మీదే కన్నేసిన సనన్.. కొన్ని కారణాలవల్ల సింగ్ ఈజ్ బ్లింగ్ చిత్రంలో నటించే అవకాశం కోల్పోయింది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు.
ఈ సందర్భంగా ఈ అమ్మడు చిత్రంలో అవకాశం కోల్పోవడంపై స్పందిస్తూ.. 'నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. వాస్తవానికి ఆ చిత్రంలో నటించాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. కానీ దురదృష్టం కొద్ది అది జరగలేదు. అయితే, రాబోయే రోజుల్లో ఏదో ఒక రోజు ప్రభుదేవా, అక్షయ్తో కలిసి తప్పకుండా నటిస్తాను' అంటూ చెప్పుకొచ్చింది సనన్.