Singh Is Bling
-
'సింగ్ ఈజ్ బ్లింగ్'కు సీక్వల్.?
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ రాఫ్తార్ సింగ్‌గా నటించిన కామెడీ ఎంటర్టైనర్ 'సింగ్ ఈజ్ బ్లింగ్'. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టి అక్షయ్ కెరీర్లో మరో బిగ్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ మూవీకి సీక్వల్ ప్లాన్ చేస్తున్నారన్న వార్త ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతుంది. దర్శకుడు ప్రభుదేవా కూడా ఈ సీక్వల్కు ఓకె చెప్పినట్టుగా సమాచారం. 'సింగ్ ఈజ్ బ్లింగ్'కు ముందు రిలీజ్ అయిన 'సింగ్ ఈజ్ కింగ్' కూడా ఘనవిజయం సాధించింది. అందుకే ఈ సీరీస్‌లో మూడో సినిమా రిలీజ్ అయితే అది అక్షయ్ కెరీర్లోనే భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశంఉందని ఫీల్ అవుతున్నారు చిత్రయూనిట్. అందుకు తగ్గట్టుగానే గత రెండు భాగాలకు మించి మరింత ఎంటర్టైనింగ్గా ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. తొలి భాగంలో కత్రినా కైఫ్ హీరోయిన్గా నటించగా, రెండో భాగంలో అమీజాక్సన్,లారా దత్తాలు హీరోయిన్లుగా కనిపించారు. ఇప్పుడు ఈ సీరీస్‌లో మూడో భాగం తెరకెక్కితే పాత నటీనటులనే కొనసాగిస్తారా లేక కొత్త వారిని తీసుకుంటారా అన్న విషయంపై కూడా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ 'ఎయిర్‌లిఫ్ట్'లో నటిస్తున్న అక్షయ్ ఆ సినిమా పూర్తయిన తరువాత 'సింగ్ ఈజ్ బ్లింగ్' సీక్వల్పై దృష్టి పెట్టనున్నాడు. -
'ఈ చిత్రం నా కెరీర్లో మైలురాయి'
ముంబై: సింగ్ ఈజ్ బ్లింగ్ చిత్రం తన కెరీర్లో అతిపెద్ద మైలురాయి అవుతుందని బ్రిటిష్ మోడల్, నటి అమీ జాక్సన్ అన్నారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్‌తో కలసి నటించే అవకాశం రావడం తన అదృష్టమని అమీ సంతోషం వ్యక్తం చేశారు. ముంబైలో ఓ థియేటర్లో ఈ చిత్రాన్ని చూసిన అమీ ప్రేక్షకుల స్పందన బాగుందని చెప్పారు. 2010లో తమిళ చిత్రం 'మద్రాసపట్టణం' ద్వారా అమీ తన కెరీర్ ప్రారంభించారు. 2012లో' ఏక్ దీవాన థ' చిత్రం ద్వారా బాలీవుడ్లో అడుగుపెట్టారు. చాలామంది స్టార్స్‌తో కలసి నటించాలని ఉందని, ఈ జాబితా పెద్దదేనని అమీ అన్నారు. -
గాయకుడిగా ప్రభుదేవా
మల్టిపుల్ టాలెంటెడ్ కళారులు అతి కొద్ది మందిలో ప్రభుదేవా ఒకరని చెప్పొచ్చు. చిన్న వయసు నుంచే నృత్యకళారంగంలో తన పనితనంతో సినీ వర్గాలను అబ్బుర పరచిన ప్రభుదేవా అంతటితోనే ఆగిపోకుండా ఇతర శాఖలపై మక్కువ చూపారు. ఫలితం నటన, దర్శకత్వం రంగాల్లోనే తన ప్రతిభను చాటుకున్నారు. తెలుగు, తమిళం, హిందీ అంటూ బహుభాషా దర్శకుడిగా విజయాలను సాధిస్తున్నారు. ఇవాళ భారతీయ సినిమాలో ప్రభుదేవా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రతిభ అన్నది ఎవరి సొత్తు కాదు. శ్రమ, పట్టుదల, కృషి ఈ మూడూ ఉంటే ఎవరైనా సాధించవచ్చుననడానికి ప్రభుదేవా ఒక ఉదాహరణ. నృత్యదర్శకుడిగా, నటుడిగా, దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్న ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి తాజాగా నిర్మాతగా మారి ఒకేసారి ఏకంగా మూడు చిత్రాలు నిర్మిస్తున్నారు. ప్రభుదేవా అంతటితో సంతృప్తి చెందలేదు. ఇప్పుడు కొత్తగా గాయకుడిగా అవతారమెత్తారు. తాను దర్శకత్వం వహిస్తున్న సింగ్ ఈజ్ బ్లింగ్ చిత్రం కోసం ఒక పాటను అలవోకగా పాడేశారు. ఈయనలోని గాయకుడ్ని కనుగొన్నది బాలీవుడ్ సంగీత దర్శకుడు సందీప్శిరోద్కర్ ప్రభుదేవా పాత హిందీ పాటల్ని లయబద్ధంగా పాడేస్తుండడం చూసిన సందీప్శిరోద్కర్ సింగ్ ఈజ్ బ్లింగ్ చిత్రంలోని పాటను పాడమన్నారట. ప్రభుదేవా పాట చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తుందంటున్నారు ఆ చిత్ర వర్గాలు. -
రామాయణాన్ని తెరకెక్కిస్తా : ప్రభుదేవా
కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత హీరోగా మారి ప్రస్తుతం బాలీవుడ్ లో దర్శకుడిగా కొనసాగుతున్న సౌత్ స్టార్ ప్రభుదేవా. డ్యాన్సర్‌గా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభుదేవా దర్శకుడిగా మాత్రం ఎక్కువగా యాక్షన్ సినిమాలనే చేస్తున్నాడు. కెరీర్ స్టార్టింగ్‌లో రీమేక్స్ మీదే దృష్టి పెట్టినా, తరువాత సొంత కథలతోనూ వందకోట్ల క్లబ్లో చేరిపోయాడు. దర్శకుడిగా ఎన్ని విజయాలు సాదించినా ఇప్పటికీ ప్రభుదేవను మంచి డ్యాన్సర్‌గానే గుర్తిస్తారు అభిమానులు. అందుకే ప్రభు దర్శకుడిగా మారిన దగ్గర నుంచి ఓ డ్యాన్స్ బేస్డ్ మూవీని ఆశిస్తున్నారు. ఇంత వరకు ప్రభుదేవ మాత్రం అభిమానుల కోరికను తీర్చలేకపోయాడు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిస్తున్న 'సింగ్ ఈజ్ బ్లింగ్' మాత్రం తన గత సినిమాల మాదిరి యాక్షన్ సినిమా కాదని, ఇదో డిఫరెంట్ కామెడీ ఎంటర్టైనర్ అంటున్నాడు. అంతేకాదు తనకు రామాయణాన్ని వెండితెర మీద ఆవిష్కరించాలన్న కోరిక ఉందన్నాడు ప్రభుదేవ. ఇదే కాన్సెప్ట్ తో హాలీవుడ్లో లార్డ్ ఆఫ్ ద రింగ్స్ సీరిస్‌ను నిర్మించారని, మన దగ్గర అలాంటి సినిమా చేయాలంటే బడ్జెట్ పరమైన సమస్య వస్తుందన్నాడు. నిర్మాత దొరికితే తప్పకుండా ఈ ప్రాజెక్ట్ ను సెట్స్ మీదకు తీసుకువస్తానన్నాడు. అలాగే ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్‌లతో సినిమా చేయాలనుందంటున్నాడు ప్రభుదేవా. -
అక్షయ్‌కి అమ్మగా...
‘ఏక్ దూజే కేలియే’తో ఆనాటి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన కథానాయిక రతీ అగ్నిహోత్రి. భర్త అనిల్ విర్వాణితో మనస్పర్థలొచ్చి, 30 ఏళ్ల వైవాహిక బంధం అర్ధంతరంగా ముగించి ఈ మధ్య వార్తల్లోకెక్కారామె. ఇది ఇలా ఉండగా ఆమెకు ఇప్పుడో మంచి అవకాశం వచ్చింది. ప్రభుదేవా దర్శకత్వంలో అక్షయ్‌కుమార్ నటిస్తున్న ‘సింగ్ ఈజ్ బ్లింగ్’లో అక్షయ్‌కి తల్లిగా ఆమె నటించనున్నారు. -
ప్చ్.. నా దురదృష్టం.. మళ్లీ చేస్తాలే
ముంబై: ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న సింగ్ ఈజ్ బ్లింగ్ చిత్రంలో నటించలేకపోతున్నందుకు తెగబాధపడిపోతోంది బాలీవుడ్ నటి కృతిసనన్. హీరో పాంటీ చిత్రంతో బాలీవుడ్ తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు తెలుగులో మహేశ్ బాబుతో కలిసి వన్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. అనంతరం బాలీవుడ్ మీదే కన్నేసిన సనన్.. కొన్ని కారణాలవల్ల సింగ్ ఈజ్ బ్లింగ్ చిత్రంలో నటించే అవకాశం కోల్పోయింది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ అమ్మడు చిత్రంలో అవకాశం కోల్పోవడంపై స్పందిస్తూ.. 'నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. వాస్తవానికి ఆ చిత్రంలో నటించాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. కానీ దురదృష్టం కొద్ది అది జరగలేదు. అయితే, రాబోయే రోజుల్లో ఏదో ఒక రోజు ప్రభుదేవా, అక్షయ్‌తో కలిసి తప్పకుండా నటిస్తాను' అంటూ చెప్పుకొచ్చింది సనన్. -
చాలా ప్రయత్నించా..!
‘1-నేనొక్కడినే’ చిత్రంలో మహేశ్‌బాబుతో ఆడిపాడిన కృతీ సనన్‌కు బాలీవుడ్లో ఆఫర్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ‘హీరోపంటి ’ చిత్రం సక్సెస్ కావడంతో ఆమెకు స్టార్ కథానాయకుల సరసన ఆడి పాడే అవకాశాలు వస్తున్నాయి. కానీ అదే సమయంలో కొన్ని సినిమాలు వదులుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. అక్షయ్‌కుమార్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘సింగ్ ఈజ్ బ్లింగ్’. ఈ చిత్రంలో నాయికగా ఆమెను తీసుకున్నారు. కానీ ఈ చిత్రం ఇంకా మొదలు కాకపోవడంతో కృతి తప్పుకున్నారు. దాంతో ఈ అవకాశం అమీ జాక్సన్‌ను వరించింది. ఈ విషయం గురించి కృతి స్పందిస్తూ -‘‘ఈ సినిమాకు డేట్స్ కేటాయించాలని చాలా ప్రయత్నించా. కానీ కుదర్లేదు. ఈ పాత్రకు అమీ చాలా చక్కగా సూట్ అవుతుంది. ఆమెకు నా బెస్ట్ విషెస్’’ అని చెప్పారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో షారుక్ ఖాన్, వరుణ్ ధావన్ హీరోలుగా చేస్తున్న ఈ చిత్రంలో వరుణ్‌కు జోడీగా ఆమెను నటించనున్నారన్న వార్తల గురించి చెబుతూ -‘‘సరైన సమయం వచ్చినప్పుడు ఈ విషయాలను వెల్లడిస్తాను’’ అని తెలిపారు. -
మొదటి మెట్టుమీదే ఉన్నా..
ముంబై: ‘నేనింకా మొదటి మెట్టుమీదే ఉన్నా.. ఇప్పుడే శిఖరం అంచుపైన దృష్టిపెడితే కిందపడిపోయే ప్రమాదం ఉంది కదా.. అందుకే నిదానంగా పైకి వెళతా..’ అంటోంది బాలీవుడ్ నటి కృతిసనన్. తాను నటించిన హిందీ సినిమా ‘హీరోపంతి’ సూపర్‌హిట్ కావడంతో ఇప్పుడు ఆమె టాక్ ఆఫ్ ది బాలీవుడ్‌గా మారిపోయింది. తాను ఇప్పటివరకు రెండు సినిమాలే చేశానని, ఒకటి బాలీవుడ్లో ‘హీరోపంతి’ కాగా, రెండోది తెలుగు సినిమా అని చెప్పింది. ’హీరోపంతి’ తామనుకున్న దానికన్నా పెద్ద హిట్ అవడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది. ‘దీంతోనే నేనేదో సాధించేశానని పొంగిపోలేను.. నేనింకా ఆరంభదశలోనే ఉన్నా.. సాధించాల్సింది చాలా ఉంది.ఇప్పుడే నేను ఏదో సాధించేశానని అనుకుంటే ఇక్కడితో నా కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టేసుకున్నట్లే..’ అని ఆమె స్పష్టం చేసింది. తన మీద అంచనాలనేవి ప్రజలు దృష్టిలో పెరగాలి తప్ప తనకు తానుగా పెంచుకోకూడదని తెలుసునంది. ‘ఇప్పుడిప్పుడే కెరీర్లో బిజీగా మారుతున్నా.. దానికనుగుణంగానే నా ఆలోచనాసరళి కూడా కొంచెం మార్చుకుంటున్నా. మొదటి అడుగులోనే విజయం సాధించినంతమాత్రాన తర్వాత అన్ని అంచనాలు ఒకేలా ఉంటాయనుకోవడం భ్రమే అవుతుంది. ‘మన హెయిర్‌స్టైల్ మార్చామనుకోండి.. మనలో భౌతికంగా కొంత మార్పు కనిపిస్తుంది కదా.. అంతమాత్రాన మనం మానసికంగా కూడా మారిపోయామనుకోవడం కరెక్ట్ కాదు..’ అని ఆమె స్పష్టం చేసింది. నేను ఈ సినిమా పరిశ్రమకు కొత్తదాన్ని. గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేరు.. అందుకే నేను వ్యక్తిగతంగా చాలామంది ప్రొడ్యూసర్లను కలిశా.. నా గురించి వివరించా.. అదృష్టవశాత్తు నా మొదటి నిర్మాత సాజిద్ నాదియావాలా నన్ను, టైగర్ షరాఫ్‌ను కన్నబిడ్డల్లా చూసుకున్నారు..’ అని చెప్పింది. సాజిద్‌తో మూడు సినిమాలకు చేసేందుకు కృతిసనన్ ఒప్పందం చేసుకుంది. అయితే నేను బయట సినిమాలకు కూడా చేసేందుకు సాజిద్ సార్ అంగీకరించారని ఆమె పేర్కొంది. తెలుగులో తాను సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో నటించిన మొదటి సినిమా ‘నేనొక్కడినే’ యావరేజ్‌గా నడిచింది. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా రెండో సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. కాగా, ప్రస్తుతం ‘హీరోపంతి’ విజయం తర్వాత తన మొదటి ప్రాధాన్యత బాలీవుడ్‌కే ఇస్తానని ముక్తాయించింది ఈ అందాల సుందరి.