చాలా ప్రయత్నించా..!
‘1-నేనొక్కడినే’ చిత్రంలో మహేశ్‌బాబుతో ఆడిపాడిన కృతీ సనన్‌కు బాలీవుడ్లో ఆఫర్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ‘హీరోపంటి ’ చిత్రం సక్సెస్ కావడంతో ఆమెకు స్టార్ కథానాయకుల సరసన ఆడి పాడే అవకాశాలు వస్తున్నాయి. కానీ అదే సమయంలో కొన్ని సినిమాలు వదులుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. అక్షయ్‌కుమార్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘సింగ్ ఈజ్ బ్లింగ్’. ఈ చిత్రంలో నాయికగా ఆమెను తీసుకున్నారు. కానీ ఈ చిత్రం ఇంకా మొదలు కాకపోవడంతో కృతి తప్పుకున్నారు.
దాంతో ఈ అవకాశం అమీ జాక్సన్‌ను వరించింది. ఈ విషయం గురించి కృతి స్పందిస్తూ -‘‘ఈ సినిమాకు డేట్స్ కేటాయించాలని చాలా ప్రయత్నించా. కానీ కుదర్లేదు. ఈ పాత్రకు అమీ చాలా చక్కగా సూట్ అవుతుంది. ఆమెకు నా బెస్ట్ విషెస్’’ అని చెప్పారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో షారుక్ ఖాన్, వరుణ్ ధావన్ హీరోలుగా చేస్తున్న ఈ చిత్రంలో వరుణ్‌కు జోడీగా ఆమెను నటించనున్నారన్న వార్తల గురించి చెబుతూ -‘‘సరైన సమయం వచ్చినప్పుడు ఈ విషయాలను వెల్లడిస్తాను’’ అని తెలిపారు.