ఓ ప్రేమికుడి ప్రయత్నం
ఓ ప్రేమికుడి ప్రయత్నం
Published Fri, Sep 13 2013 12:31 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM
రణధీర్‌రెడ్డి, స్వాతి దీక్షిత్, సురేష్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘బ్రేకప్’. ఒయాసిస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి అమర్ కామేపల్లి దర్శకుడు. ఈ 20న విడుదల కానున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ -‘‘తెగిపోయిన బంధాలనుకలపడానికి ఓ ప్రేమికుడు చేసిన ప్రయత్నమే ఈ సినిమా.
దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ కథ తయారు చేశాను. తెలుగునాట వంద థియేటర్లలో, యూఎస్‌లో కూడా కొన్ని చోట్ల ఈ సినిమా విడుదల అవుతోంది’’ అని తెలిపారు. ఇంకా కథా రచయిత ఆర్‌డీ రామచంద్రారెడ్డి, మాటల రచయిత ప్రశాంత్ సాగర్, సంగీత దర్శకుడు రాహుల్ కూడా మాట్లాడారు.
Advertisement
Advertisement