Swathi Deekshith
-
నటి స్వాతి దీక్షిత్ స్టన్నింగ్ లుక్స్ (ఫొటోలు)
-
ఎన్ఆర్ఐ ఇల్లు కబ్జాకు యత్నం.. నటి స్వాతి దీక్షిత్‌పై కేసు
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో రూ. 30 కోట్ల విలువ చేసే ఖరీదైన ఎన్ఆర్ఐ ఇంటిని కబ్జా చేసేందుకు యత్నించిన నిందితులపై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్ రోడ్ నెం. 58లో అమెరికాలో నివసిస్తున్న అంతారం మాదురి అనే ఎన్ఆర్ఐకి 1100 గజాల్లో భవనం ఉంది. భవనంలోని మొదటి అంతస్తులో బంధువులు నివాసం ఉండగా గ్రౌండ్‌ఫ్లోర్ ఖాళీగా ఉంది. ఏడాది క్రితం ఈ భవనంలో కాఫీ షాప్ ఏర్పాటు చేస్తానంటూ మాధురిని సినీ నటి స్వాతి దీక్షిత్ సంప్రదించారు. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో లీజు రద్దు చేసుకున్నారు. ఈ విషయంపై న్యాయస్థానాల్లో వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం సుమారు 20 మంది దుండగులు దౌర్జన్యంగా గేటు విరగ్గొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అడ్డుకున్న వాచ్మెన్ అశోక్ భార్య శోభారాణి మీద దాడి చేయడంతో పాటు ఇంట్లోని వస్తువులను ధ్వంసంచేశారు. ఈ మేరకు యజమాని మాధురికి సమాచారం ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు అక్కడికి చేరుకోగా దుండగుల్లో కొందరు పరారు కాగా ఇద్దరు పోలీసులకు పట్టుబడ్డారు. పట్టుబడ్డ వారిలో రణ్వీర్ సింఘ్, కండె రాంకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా తమ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడంతో పాటు ఇంటిని కబ్జా చేసేందుకు యత్నించారంటూ స్వాతి దీక్షిత్, చింతల ప్రశాంత్ తదితరులపై చర్యలు తీసుకోవాలంటూ వాచ్మెన్ శోభారాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నటి స్వాతి దీక్షిత్‌తో పాటు మరో మగ్గురిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బిగ్‌బాస్: చతికిలపడ్డ కంటెస్టెంట్లు వీళ్లే
అంగరంగ వైభవంగా ప్రారంభమైన బిగ్‌బాస్ నాల్గో సీజన్లో 19 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. 16 మందితో మొదలైన షోలో మరో మూడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చి చేరాయి. కానీ ఏ వైల్డ్ కార్డ్ కంటెస్టెంటు కూడా ఫినాలేకు చేరుకోలేకపోయింది. కొందరు మెరుపు తీగల్లా వచ్చి వెళ్లిపోగా, భారీ అంచనాల మధ్య వచ్చిన మరికొందరు మాత్రం ఉనికిని కూడా చాటుకోలేక అభిమానులను నిరుత్సాహానికి గురి చేశారు. అలాంటి కంటెస్టెంట్లు ఎవరెవరే చూద్దాం... సూర్యకిరణ్ తన కోపమే తన శత్రువు అన్న వాక్యం దర్శకుడు సూర్య కిరణ్ విషయంలో అక్షరాలా నిజమైంది. ఎదుటి వాళ్లు చెప్పేది వినకుండా, ప్రతిదానికి చిర్రుబుర్రులాడేవాడు. అందుకే షోలో అడుగు పెట్టిన మొదటి వారమే షో నుంచి నిష్క్రమించాడు. కానీ తను హౌస్‌లో ఉండాల్సిన వ్యక్తి అని, ఇలా ఎలిమినేట్ అయిపోతాననుకోలేదని చెప్పుకొచ్చాడు. కానీ రెమ్యూనరేషన్ మాత్రం ఊహించినదానికన్నా పది రెట్లు ఎక్కువే ఇచ్చారని చెప్పాడు. (చదవండి: వారం రోజులకు లక్షల్లో ఇచ్చారు) కరాటే కల్యాణి అప్పుడే కోప్పడుతూ అప్పుడే ఏడుస్తూ కల్యాణి ఎవరికీ ఓ పట్టాన అర్థం కాలేదు. చిన్నచిన్న విషయాలకు కూడా పెద్ద రాద్ధాంతం చేసేది. అలా ఆమె పెద్దపెద్దగా కేకలేస్తూ అందరి మీద నోరు పారేసుకోవడంతో సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేశారు. చాలామందితో కయ్యం పెట్టుకుని చివరికి రెండో వారంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. కానీ ఆమె అమ్మ రాజశేఖర్‌తో కలిసి అందరినీ తెగ ఎంటర్టైన్ చేసేది. (చదవండి: అభిజిత్ బిగ్‌బాస్‌కే గర్వకారణం) స్వాతి దీక్షిత్ ఇంట్లో మూడో వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన బొద్దు గుమ్మ స్వాతి దీక్షిత్. ఆమె ఎంట్రీ, ఎలిమినేషన్ రెండూ అందరినీ సర్ప్రైజ్ చేశాయి. ఇంట్లోకి వెళ్లగానే ఆమెను ఇంప్రెస్ చేసేందుకు అబ్బాయిలు పోటీపడ్డారు. చివరికి ఆమె అభిజిత్‌తో కనెక్ట్ కావడం, అభిజిత్-హారిక మధ్య గ్యాప్ రావడం, ఇంతలో ఆమె ఎలిమినేట్ కావడం చకచకా జరిగిపోయాయి. (చదవండి: స్వాతిలో అది నాకు నచ్చలేదు: లాస్య) యాంకర్ లాస్య లాస్య అనగానే గుర్తొచ్చేది చీమ-ఏనుగు జోకులు. ఆమె వేసే జోకులకు ఎవరూ నవ్వకపోయినా ఆమె మాత్రం పడీపడీ నవ్వేది. కానీ ఈ నవ్వే ఆమెకు నానాపేర్లు తెచ్చిపెట్టింది. ఫేక్ స్మైల్, కవరింగ్ స్మైల్ అంటూ మిగతావాళ్లు లాస్య గురించి ఎన్నో అన్నారు. ఇది పక్కన పెడితే ఈ యాంకర్ నుంచి ఆమె అభిమానులు ఎంతగానో ఆశించారు. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్కు మ్యాచ్ అవకుండా ఆమె కిచెన్లోనే ఉండిపోయి వంటలక్కగా మారిపోయింది. టాస్కుల్లోనూ వెనకబడిపోయింది. (చదవండి: టాప్ 2: లాస్య జోస్యం నిజమయ్యేనా?) జోర్దార్ సుజాత తెలంగాణ యాసలో మాట్లాడే ఈ యాంకర్ కిలకిలా నవ్వుతూనే ఉండేది. ఎప్పుడు చూసినా లాస్యతో కలిసి ఇంట్లో జరిగే విషయాల గురించి గుసగుసలు పెట్టేది. అలా ఆమెకు గాసిప్ క్వీన్ అన్న ముద్ర పడిపోయింది. అయితే వ్యాఖ్యాత నాగార్జునను పట్టుకుని ఆమె బిట్టూ అని పిలవడం చాలామందికి నచ్చలేదు. దీంతో ఐదోవారంలోనే ముల్లెమూట సర్దుకుని ఇంటిబాట పట్టింది. బయటకు వచ్చాక సుజాత మాట్లాడుతూ తనను బిట్టూ అని బిగ్‌బాస్ యూనిటే పిలవమని చెప్పిందంటూ తనపై జరుగుతున్న ట్రోలింగ్‌కు గట్టి సమాధానం ఇచ్చింది. (చదవండి: బిట్టూ అని వాళ్లే పిలవమన్నారు: సుజాత) కుమార్ సాయి బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టిన మొట్ట మొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంటు. ఎవరితోనూ కలవలేక, క్లారిటీ లేని సమాధానాలతో కన్ఫ్యూజన్ మాస్టర్‌గా నిలిచాడు. కొన్ని టాస్కుల్లో బాగా ఆడి కెప్టెన్ అయినప్పటికీ హౌస్‌లో ఉన్నానా? లేనా? అన్నట్టుగా ఉండటంతో అతడిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. హౌస్‌లో కూడా ఇంటిసభ్యులు కుమార్‌ను తమలో ఒకరుగా ఫీల్ అవలేదు. దీంతో అతడు ఏకాకిగా మారిపోయాడు. చివరికి ఏడో వారంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. కానీ నాగార్జున స్క్రిప్ట్ చెప్పాలన్న కోరికకు నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సంతోషంగా వీడ్కోలు తీసుకున్నాడు. -
రీ ఎంట్రీ కోసం స్వాతి ఫ్యాన్స్ ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ఆమె బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నంతవరకూ ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఆమె బయటకు వచ్చి మాట్లాడటం మొదలు పెట్టాక ఆమె చెప్పే పాయింట్లు, మాట తీరు అందరినీ అబ్బురపరుస్తున్నాయి. ఆమె మరెవరో కాదు, గతవారం ఎలిమినేట్ అయిన స్వాతి దీక్షిత్. మూడో వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా హౌస్‌లో అడుగుపెట్టి అందరినీ కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలోనే హఠాత్తుగా ఎలిమినేషన్ బాంబును ఆమె నెత్తిన వేశారు. దీంతో షాకైన స్వాతి బయటకు వచ్చాక ఒక్కో ఎపిసోడ్ చూసి ఇంకా నిశ్చేష్టురాలైంది. తను చేసినదానిలో 10 శాతం మాత్రమే చూపించారని వాపోయింది. అభిమాన నటి బిగ్‌బాస్ షోకు మెరుపుతీగలా వెళ్లి రావడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఆమె హౌస్‌కు మళ్లీ వెళ్లాల్సిందేనంటూ పోరాడుతున్నారు. (హారిక ఫోకస్ అంతా అభిజిత్‌పైనే ఉంది) ఎలిమినేషన్ బిగ్‌బాస్ టీమ్ చేతిలో ఉంది ఈ నేపథ్యంలో స్వాతి దీక్షిత్ అభిమానులు అన్నపూర్ణ స్టూడియో ఎదుట బుధవారం ఆందోళన చేపట్టారు. స్వాతి దీక్షిత్ చేసినవాటిని ఎందుకు టెలికాస్ట్ చేయలేదని నిలదీశారు. ఆమెను రీ ఎంట్రీ ద్వారా మళ్లీ బిగ్‌బాస్ హౌస్‌లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ ఎలిమినేషన్ చూస్తోంటే ప్రతివారం ఎవరెవరిని ఎలిమినేట్ చేయాలనేది బిగ్‌బాస్ టీమ్ ముందుగానే డిసైడ్ అయిపోయినట్లు కనిపిస్తోందని విమర్శిస్తున్నారు. ఓటింగ్‌లోనూ చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న స్వాతిని కావాలనే పంపించేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రేక్షకుల చేతిలోనే ఎలిమినేషన్ ఉందని నాగ్ అంటున్నారు. కానీ అలా జరగడం లేదని, అందుకే బిగ్‌బాస్ నచ్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. "ఇది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్, స్వాతి దీక్షిత్‌ను తిరిగి తీసుకురండి" అని ప్లకార్డులు ప్రదర్శించారు. (మాస్టర్‌పై ప్రతీకారం తీర్చుకున్న స్వాతి దీక్షిత్) -
వైల్డ్ కార్డ్ ఎంట్రీ: ఇద్దరా? ముగ్గురా?
సెప్టెంబర్ ఆరున గ్రాండ్‌గా ప్రారంభమైన బిగ్‌బాస్ నాల్గవ సీజన్లో 16 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఇందులో ముందుగా ఊహించిన ఓ కంటెస్టెంటు మాత్రం మిస్సయ్యాడు. అతడే జబర్దస్థ్ కమెడియన్ ముక్కు అవినాష్. సోషల్ మీడియాలో ఎప్పటినుంచో అవినాష్ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంటరవుతున్నాడంటూ బోలెడన్ని వార్తలు వీరవిహారం చేశాయి. కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో అతను ఎంట్రీ ఇవ్వకపోవడంతో అందరూ ఖంగు తిన్నారు. అలా అని అవినాష్ షో నుంచి తప్పుకున్నాడని చెప్పలేం. అతడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తగిన సమయం చూసి బిగ్‌బాస్ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ బాణాన్ని వదలనున్నట్లు కనిపిస్తోంది. (చూడాలి: దేత్తడి హారిక: బెడిసి కొట్టిన పబ్లిసిటీ!) సాయికుమార్ బిగ్‌బాస్ హౌస్‌లోకి! అవినాష్‌తోపాటు ప్రజలకు పరిచయం ఉన్న మరో ముఖం కూడా త్వరలోనే బిగ్‌బాస్ హౌస్‌లో చూసే సూచనలు కన్పిస్తున్నాయి. 'ఈ రోజుల్లో' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సాయికుమార్ కూడా హౌస్‌లో భాగం కానున్నాడు. అసలే హౌస్‌లో సెలబ్రిటీలు పెద్దగా లేరు, ఉన్నవాళ్లు కూడా యాక్టివ్‌గా లేకపోవడంతో షో రక్తికట్టడం లేదు. దీంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారానైనా బిగ్‌బాస్‌కు బిగ్ బ్రేక్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నారు. పనిలో పనిగా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పంపించేందుకు ఓ అమ్మాయిని కూడా సెలక్ట్ చేసి పెట్టారు. 'జంప్ జిలానీ' హీరోయిన్ స్వాతి దీక్షిత్‌ను ఓ ఆప్షన్‌గా పెట్టుకున్నారు. ఈమె చిత్రాంగధ, లేడీస్ అండ్ జెంటిల్మెన్ చిత్రాల్లోనూ నటించింది (చూడాలి: రూ.50 లక్షలు వస్తే.. : గంగవ్వ) వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను ప్రేక్షకులు ఆదరిస్తారా? వైల్డ్ కార్డ్ ఎంట్రీల వల్ల బిగ్‌బాస్ షో ఎంత రచ్చరచ్చగా మారిందో గత సీజన్లలోనే చూశాం. మూడో సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా కంటెస్టెంట్లతో ఆడుకుని వారిని ఏడిపించిన విషయం తెలిసిందే. ఆమె అరాచకాలను చూడలేక ప్రేక్షకులు రెండు మూడు వారాల్లోనే తమన్నాను బయటకు పంపించారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా శిల్పా శెట్టిని కూడా లోనికి పంపించినప్పటికీ అటు కంటెస్టెంట్లతో పాటు ఇటు ప్రేక్షకులు కూడా ఆమెకు కనెక్ట్ అవలేదు. దీంతో ఆమె కూడా వచ్చినదారినే తిరుగుముఖం పట్టింది. ఇప్పటివరకు ఏ వైల్డ్ కార్డ్ కంటెస్టెంటు కూడా టైటిల్ గెలుచుకున్న దాఖలాలు లేవు. మరి ఈసారి వచ్చే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లైనా టైటిల్ కోసం పోరాడుతారా? వచ్చినదారినే వెళ్లిపోతారా? అసలు ప్రేక్షకులు వీరిని ఏమేరకు ఆదరిస్తారు అనేది చూడాల్సిందే. (చూడాలి: బిగ్‌బాస్ అనైతిక షో: నారాయణ) -
ఆకృతి ఎలైట్ ఎగ్జిబిషన్
-
'లేడీస్ అండ్ జెంటిల్మెన్' ఫేం స్వాతితో చిట్‌చాట్
-
నాయకుడంటే జగన్‌లా ఉండాలి..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాన్ని అధిగమించి ప్రజలకు మంచి పాలన ఇచ్చే సత్తా ఒక్క జగన్‌కే ఉంది. యువశక్తికి ప్రతినిధి జగన్. నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతదాకైనా పోరాడతారు. ఎవరి మద్దతున్నా, లేకున్నా అనుకున్నది సాధించేవరకు విశ్రమిం చరు. సమైక్యరాష్ట్రం కోసం చివరిక్షణం వరకు పోరాడింది జగనే. నాయకుడంటే అలా ఉండాలి. ఇంకో ముఖ్య విషయం... ఐ హేట్ కాంగ్రెస్. రాష్ట్రాన్ని, దేశాన్ని అధోగతి పాల్జేసిన కాంగ్రెస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తాను. ప్రజలకు మంచి జీవితం కావాలంటే మంచి నేతను ఎన్నుకోవాలి. జగన్‌లాంటి నాయకుడు రాష్ట్రానికి ఎంతో అవసరం. -
ఏమో ఏమౌనో...
రాజా, స్వాతి దీక్షిత్ జంటగా తిరుపతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఏమో ఏమౌనో’. సై, జై చిరంజీవ తదితర చిత్రాల్లో నటించిన సూర్యప్రసాద్ (పింగ్ పాంగ్) ఈ చిత్రం ద్వారా నిర్మాతగా మారారు. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ -‘‘నేను తొలిసారి పోలీసాఫీసర్‌గా నటిస్తున్న చిత్రం ఇది. నా పాత్ర మాస్ టచ్‌తో ఉంటుంది. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సూర్యకు ఈ చిత్రం ద్వారా నిర్మాతగా కూడా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. సూర్యప్రసాద్ మాట్లాడుతూ -‘‘ధనార్జనే ధ్యేయంగా ఈ సినిమాని నిర్మించడంలేదు. సూర్య మంచి నిర్మాత అనిపించుకోవాలన్నదే నా లక్ష్యం. మంచి కథాంశంతో ఈ చిత్రం చేస్తున్నా. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. అన్ని శాఖలకన్నా నిర్మాణం చాలా కష్టం. యూనిట్ సభ్యుల సహకారంతో షూటింగ్ సజావుగా జరుగుతోంది. 90 శాతం సినిమా పూర్తయ్యింది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చెప్పారు. దర్శకునిగా అవకాశం ఇచ్చినందకు ధన్యవాదాలు తెలిపారు తిరుపతి మాధవ్. ఈ చిత్రానికి సంగీతం: ఐ.టి. ప్రధాన్, ఎడిటింగ్: నందమూరి హరి, కెమెరా: ప్రభాకర్. -
బ్రేక్అప్ ఓ ఈవెంట్
‘‘నేడు సీరియస్ ప్రేమలు అరుదు. త్వరగా ప్రేమలో పడినట్లే, విడి పోవడం కూడా త్వరగానే జరుగుతోంది. బ్రేక్అప్ని కూడా ఓ ఈవెంట్‌గా భావించే ట్రెండ్ నడుస్తోందంటే అతిశయోక్తి కాదు’’ అంటున్నారు అమర్ కామేపల్లి. రణధీర్, స్వాతీదీక్షిత్ జంటగా ఆయన దర్శకత్వంలో ఒయాసిస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన చిత్రం ‘బ్రేక్అప్’. రేపు ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ చిత్రవిశేషాలను ఇంకా దర్శకుడు చెబుతూ - ‘‘కొత్త తరహా స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇది రొమాంటిక్ సైంటిఫిక్ థ్రిల్లర్. ప్రేమలోని పలు మలుపులను చూపించే చిత్రం’’ అని చెప్పారు. -
ఓ ప్రేమికుడి ప్రయత్నం
రణధీర్‌రెడ్డి, స్వాతి దీక్షిత్, సురేష్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘బ్రేకప్’. ఒయాసిస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి అమర్ కామేపల్లి దర్శకుడు. ఈ 20న విడుదల కానున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ -‘‘తెగిపోయిన బంధాలనుకలపడానికి ఓ ప్రేమికుడు చేసిన ప్రయత్నమే ఈ సినిమా. దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ కథ తయారు చేశాను. తెలుగునాట వంద థియేటర్లలో, యూఎస్‌లో కూడా కొన్ని చోట్ల ఈ సినిమా విడుదల అవుతోంది’’ అని తెలిపారు. ఇంకా కథా రచయిత ఆర్డీ రామచంద్రారెడ్డి, మాటల రచయిత ప్రశాంత్ సాగర్, సంగీత దర్శకుడు రాహుల్ కూడా మాట్లాడారు.