26న తెరపైకి మెడ్రాస్ | madras movie Releasing on 26th | Sakshi
Sakshi News home page

26న తెరపైకి మెడ్రాస్

Published Mon, Sep 15 2014 12:58 AM | Last Updated on Mon, Oct 8 2018 4:08 PM

26న తెరపైకి మెడ్రాస్ - Sakshi

26న తెరపైకి మెడ్రాస్

 ఎట్టకేలకు మెడ్రాస్ చిత్రం విడుదలకు తేదీ ఖరారైంది. కార్తీ హీరోగా నటించిన తాజా చిత్రం మెడ్రాస్. ఆయనకు జంటగా క్యాథరిన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి అట్టకత్తి ఫేమ్ రంజిత్ దర్శకత్వం వహించారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావలసింది. చిత్ర టైటిల్‌పై తమిళ భాషా పరిరక్షక సంఘాలు తమిళ భాషాభిమానులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. మెడ్రాస్‌ను చెన్నై నగరంగా మార్చిన చాలా ఏళ్ల తరువాత మళ్లీ పాత మెడ్రాస్‌ను గుర్తు చేసే ఈ చిత్రం టైటిల్‌ను పెట్టడం మంచిది కాదంటూ ఘోషిస్తున్నారు.
 
 ఏదైమైనా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఓకే చెప్పింది. ఇటీవల మెడ్రాస్ చిత్రాన్ని తిలకించిన సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఉత్తర చెన్నై నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మాస్ ఎంటర్ టైనర్‌గా ఉంటుందని యూనిట్ వర్గాలంటున్నారుు. మరో విషయం ఏమిటంటే ఈ మధ్య కార్తీ నటించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో మెడ్రాస్ చిత్రం విజయం సాధించడం కార్తీకి చాలా అవసరం. ఈ చిత్రం ఈ నెల 26న విడుదలకు ముస్తాబవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement