'మహానటి' ఇమేజ్ అలాగే ఉంది..! | Mahanati Overseas rights sold for huge price | Sakshi
Sakshi News home page

'మహానటి' ఇమేజ్ అలాగే ఉంది..!

Published Tue, Aug 29 2017 2:24 PM | Last Updated on Sun, Sep 17 2017 6:06 PM

'మహానటి' ఇమేజ్ అలాగే ఉంది..!

'మహానటి' ఇమేజ్ అలాగే ఉంది..!

అలనాటి అందాల తార సావిత్రి జీవితకథ ఆధారంగా మహానటి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, సావిత్రి పాత్రలో నటిస్తుండగా మలయాళ యువ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ జెమినీ గణేషన్ పాత్రలో కనిపించనున్నాడు. స్టార్ హీరోయిన్ సమంత మరో కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈసినిమాకు అప్పుడే బిజినెస్ కూడా స్టార్ అయ్యింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఓవర్ సీస్ హక్కులను భారీ మొత్తానికి ఓ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సొంతం చేసుకుంది. ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాని ఈ సినిమాను 4.5 కోట్లకు నిర్వాణ సినిమాస్ సొంతం చేసుకుందట. అశ్వినిదత్ కుమార్తె స్వప్న దత్ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement