
మహేశ్‌బాబు
మహర్షి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. యూఎస్‌ని చుట్టేసిన ఆయన హైదరాబాద్‌లో పాగా వేశారు. మరి ఈ ప్రయాణాల్లో ఏయే విషయాలు తెలుసుకున్నారు? అన్నది తెలియాలంటే వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే. మహేశ్‌బాబు, పూజా హెగ్డే జంటగా వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మహర్షి’. అశ్వినీదత్, ‘దిల్’ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేశ్‌బాబు మిత్రుడిగా ‘అల్లరి’ నరేశ్ నటిస్తున్నారు. మహేశ్ బాబు ‘రిషి’ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రస్తుతం మహేశ్‌బాబు, ప్రకాశ్‌రాజ్, జయసుధపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ షెడ్యూల్ ఈ నెల 17వరకూ సాగనుంది. ఈ షెడ్యూల్ తర్వాత నెల రోజుల పాటు ఓ పెద్ద షెడ్యూల్ ప్లాన్ చేస్తోంది చిత్రబృందం.