ఐటీ సోదాలు.. లైట్‌ తీసుకున్న దిల్ రాజు | Maharshi Producer Dil Raju Reaction On It Raids | Sakshi
Sakshi News home page

ఐటీ సోదాలు.. లైట్‌ తీసుకున్న దిల్ రాజు

Published Wed, May 8 2019 2:08 PM | Last Updated on Wed, May 8 2019 2:20 PM

Maharshi Producer Dil Raju Reaction On It Raids - Sakshi

మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షి సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా టికెట్‌ ధరల పెంపు వివాదం కొనసాగుతుండగానే చిత్ర నిర్మాత దిల్ రాజు ఆఫీస్‌లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. భారీ బడ్జెట్‌ తో ముగ్గురు నిర్మాతలు సంయుక్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సినిమా కావటంతో మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
(చదవండి : దిల్ రాజు ఆఫీస్‌లో ఐటీ సోదాలు )

బిజినెస్‌ కూడా అదే స్థాయిలో జరిగిందన్న ప్రచారం‍ జరుగుతుండటంతో ఐటీ అధికారులు దిల్ రాజు ఆఫీసులో సోదాలు చేశారు. ఈ విషయంపై స్పందించిన దిల్ రాజు ఐటీ దాడులు కామన్‌ అంటూ లైట్‌ తీసుకున్నారు. పెద్ద సినిమాల రిలీజ్‌ సమయంలో ఇలాంటి దాడులు జరుగుతాయని అదేం పెద్ద విషయం కాదన్నారు.
(చదవండి : టికెట్‌ రేట్ల పెంపుపై ప్రభుత్వం సీరియస్‌ )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement