Tollywood Celebrities Spotted At Dil Raju Son Anvi Reddy First Birthday Celebrations - Sakshi
Sakshi News home page

Dil Raju Son Photos: గ్రాండ్‌గా దిల్‌ రాజు తనయుడి బర్త్‌డే, ఫోటోలు, వీడియోలు వైరల్‌

Published Fri, Jun 30 2023 1:54 PM | Last Updated on Fri, Jun 30 2023 3:12 PM

Dil Raju Son Anvi Reddy First Birthday Celebrations - Sakshi

టాలీవుడ్‌ నిర్మాత దిల్‌ రాజు తనయుడు అన్వి రెడ్డి బర్త్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. అన్వి రెడ్డి మొదటి బర్త్‌డే కావడంతో తెలుగు ఇండస్ట్రీతో పాటు ఇతర పరిశ్రమలకు చెందిన సెలబ్రిటీలకు సైతం ఆహ్వానాలు అందించాడు దిల్‌ రాజు. గురువారం జరిగిన ఈ బర్త్‌డే పార్టీలో తండ్రీకొడుకులు బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసిపోయారు. ఈ వేడుకకు చిరంజీవి దంపతులు, మహేశ్‌బాబు, అతడి కూతురు సితార, హీరో వెంకటేశ్‌, హీరోయిన్లు రాశీఖన్నా, శ్రీలీల, డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి సహా ఇతర సెలబ్రిటీలు విచ్చేశారు.

బర్త్‌డే బాయ్‌ అన్విరెడ్డికి బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. కాగా 2020లో దిల్‌ రాజు.. తేజస్వినిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి గతేడాది బాబు జన్మించగా అతడికి అన్విరెడ్డి అని నామకరణం చేశారు.

దిల్‌ రాజు కెరీర్‌ మొదలైందిలా
డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్‌ ప్రారంభించిన వెంకటరమణారెడ్డి (దిల్‌ రాజు అసలు పేరు).. ‘దిల్‌’ సినిమాతో నిర్మాతగా మారాడు. 20 ఏళ్ల క్రితం (2003, ఏప్రిల్‌ 4) ‘దిల్‌’ సినిమా విడుదలవగా అప్పట్లో అది సంచలనం రేపింది. నితిన్‌ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని తన స్నేహితుడు గిరి, తమ్ముడు శిరీష్ తో కలిసి నిర్మించాడు. ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. అప్పటి నుంచి వెంకటరమణారెడ్డి కాస్త ‘దిల్‌ రాజు’గా మారిపోయాడు. ఈ 20 ఏళ్లలో 50 చిత్రాలను నిర్మించి అత్యధిక సక్సెస్‌ రేటు సాధించాడు.

చదవండి: రాకేశ్‌ మాస్టర్‌ ఇచ్చిన ఆస్తి పేపర్లు చింపేశాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement