మూగపాత్రలో నటిస్తున్న హీరో | Mahat raghavendra plays mute character in 'Chennai 600028' sequel | Sakshi
Sakshi News home page

మూగపాత్రలో నటిస్తున్న హీరో

Published Tue, Jul 5 2016 2:53 PM | Last Updated on Mon, Sep 4 2017 4:11 AM

మూగపాత్రలో నటిస్తున్న హీరో

మూగపాత్రలో నటిస్తున్న హీరో

తమిళ స్పోర్ట్స్ డ్రామా ‘చెన్నై 600028: సెకండ్ ఇన్నింగ్స్’ సినిమాలో నటిస్తున్న మహత్ రాఘవేంద్ర.. ఆ సినిమాలో మూగవాడి పాత్రలో నటిస్తున్నాడట. ఇంతకుముందు చేసిన అన్ని సినిమాల్లో చాక్లెట్ బోయ్లా, మంచి సరదాగా ఉండే మహత్.. ఈసారి మాత్రం చాలా విభిన్నమైన పాత్ర ఎంచుకున్నాడని, అతడి లుక్ చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారని సినిమా వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఈ పాత్ర కోసం మహత్ కాస్త నల్లబడ్డాడట కూడా. అతడికి మేకప్ వేయడానికి రోజుకు రెండు గంటలు సమయం పట్టిందని, ఈ పాత్ర చేయడం చాలా క్లిష్టతరమైనదని చెప్పారు.

ఈ సినిమాలో ఇంకా జై, శివ, ప్రేమ్జీ, నితిన్ సత్య, విజయ్ వసంత్, వైభవ్, సంపత్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. వెంకట్ ప్రభు దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మదురైలో స్ట్రీట్ క్రికెట్ ఆడే వాళ్ల గురించి ఈ సినిమా ఉంటుంది. ఈ పాత్ర చేయడానికి మహత్ ఏమాత్రం కష్టపడలేదని.. వెంకట్ ప్రతి సీన్ ముందుగా నటించి చూపించడంతో అతడికి బాగా సులభమైందని అంటున్నారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement