
నా జీవితానికి వెలుగు, నాకు బలం : మహేష్
సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాల విషయంలో రకరకాల పుకార్లు వినిపిస్తుంటాయి. ముఖ్యంగా ఇటీవల కాలం చాలా మంది సినీ ప్రముఖులు విడాకులు తీసుకుంటుండటంతో ఆ పుకార్లు మరీ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆదర్శ దంపుతులుగా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ స్టార్ కపుల్ మహేష్, నమ్రత. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట, ఎంత మంది సెలబ్రిటీలకు ఆదర్శంగా నిలిచింది.
ఇప్పటికే వీరిద్దరు ఒకరి మీద ఒకరు తమకున్న ప్రేమను రకరకాలుగా తెలియజేశారు. అదే బాటలో ఈ రోజు నమ్రత పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలతో పాటు తన ప్రేమను కూడా తెలియజేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. 'నా బలం, నా జీవితానికి వెలుగు. నా జీవిత భాగస్వామికి పుట్టిన రోజు శుభాకాంక్షలు' అంటూ తన ట్విట్టర్ పేజ్లో నమత్ర ఫోటోతో సహా ట్వీట్ చేశాడు.
My strength and the light of my life - Happy Birthday to my dearest wife :) pic.twitter.com/OemBbGNKqK
— Mahesh Babu (@urstrulyMahesh) 22 January 2017