
‘భరత్ అనే నేను’ ప్రభంజనం కొనసాగుతోంది. ఒకవైపు సినిమా విజయవంతంగా నడుస్తోంది. మరోవైపు ప్రచార కార్యక్రమాలు కూడా అదే ఊపులో కొనసాగుతున్నాయి. సక్సెస్‌మీట్‌లు, మేకింగ్ వీడియోలు, ఇంటర్వ్యూలు ఇలా సినిమాకు సంబంధించిన ఏదో ఒక విషయాన్ని బయటకు తెస్తూనే ఉన్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు విజయవాడకు వెళ్లి అభిమానుల మధ్యలో సినిమాను చూశారు. ఇప్పుడు మహేశ్ కూతురు సితార కూడా నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. సితారకు సోషల్‌మీడియాలో భారీగా ఫాలోయింగ్ ఉంది.
ప్రస్తుతం భరత్ అనే నేను సినిమాలోని అసెంబ్లీ సెట్‌లో సితార ఉన్న ఫోటో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా సితార ఈ సినిమాలోని పాటను పాడిన వీడియో కూడా హల్‌చల్ చేస్తోంది. ఇది కలలా వున్నదే...అన్న సాంగ్‌ను సితార ముద్దుముద్దుగా పాడటంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment