
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటుడిగానే కాదు బిజినెస్‌మేన్ గానూ బిజీ అవుతున్నాడు. ఇప్పటికే సినిమా నిర్మాణం ప్రారంభించిన మహేష్, తాజాగా డిజిటల్ మీడియాలోకి అడుగుపెట్టబోతున్నాడు. జియోతో కలిసి మహేష్ నిర్మిస్తున్న వెబ్ సిరీస్‌కు టైటిల్‌ను నిర్ణయించారు. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్‌కు ‘చార్లీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
డిటెక్టివ్ తరహా కథతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‌ను మూడు సీజన్లలో 8 ఎపిసోడ్లుగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు యూనిట్. మహేష్ ప్రస్తుతం తన 25వ సినిమాగా తెరకెక్కుతున్న మహర్షి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment