‘మహర్షి’ ప్రయాణం మొదలవుతోంది..! | Mahesh Babu Maharshi First Song to Release on 29th March | Sakshi
Sakshi News home page

‘మహర్షి’ ప్రయాణం మొదలవుతోంది..!

Published Wed, Mar 27 2019 10:12 AM | Last Updated on Sun, Apr 7 2019 12:28 PM

Mahesh Babu Maharshi First Song to Release on 29th March - Sakshi

సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మహర్షి. దిల్ రాజు, అశ్వనీదత్‌, పీవీపీలు సయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. ఇది మహేష్ 25వ సినిమా కూడా కావటంతో మహర్షిపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ  సినిమాను మే9 న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభిస్తున్న చిత్రయూనిట్ మార్చి 29న తొలి పాటను రిలీజ్‌ చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో తొలిసారిగా అల్లరి నరేష్‌ లుక్‌ను రివీల్ చేశారు.  ‘ఛోటి ఛోటి బాతే’ అంటూ సాగే ఫ్రెండ్‌ షిప్‌ సాంగ్‌ను 29 ఉదయం 9:09 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టుగా తెలిపారు. ఈసినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement