సూపర్ స్టార్ మహేష్ బాబు రాజకీయాలకు దూరంగా ఉంటారు. కానీ భరత్ అనే నేను రిలీజ్ తరువాత సీన్ మారిపోయింది. ముఖ‍్యంగా ఈ సినిమా చూసిన తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో మహేష్‌కు మంచి రిలేషన్ ఏర్పడింది. భరత్ అనే నేను సినిమా చూసిన తరువాత మహేష్, కొరటాలలతో కలిసి ఓ మీడియా సమవేశాన్ని కూడా ఏర్పాటు చేశారు కేటీఆర్. ఈ సందర్భంగా మహేష్, కేటీఆర్‌ల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.
మహేష్ కేవలం అమ్మాయిలకు మాత్రమే సెల్ఫీలు ఇస్తారని, నేను మాత్రం అబ్బాయిలకు కూడా సెల్ఫీలు ఇస్తానంటూ సరదాగా కామెంట్ చేశారు కేటీఆర్. తాజాగా ట్విటర్ ఓ వ్యక్తి కేటీఆర్‌తో దిగిన ఫొటోను ట్వీట్ చేస్తూ ‘నిజమే కేటీఆర్ గారు అబ్బాయిలకు కూడా సెల్ఫీలు ఇస్తారు’ అంటూ కామెంట్ చేశాడు. ఈ ట్వీట్‌ను మహేష్‌కు ట్యాగ్ చేసిన కేటీఆర్ ‘హ..హ.. మహేష్ ఇది నీకోసమే’ అంటూ కామెంట్ చేశారు. కేటీఆర్ ట్వీట్‌పై స్పందించిన మహేష్ ఓ స్మైలితో రిప్లై ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment