‘మహర్షి’ ఆలస్యానికి కారణం మహేషే! | Mahesh Babu is The Reason for Maharshi Delay | Sakshi
Sakshi News home page

‘మహర్షి’ ఆలస్యానికి కారణం మహేషే!

Published Thu, Apr 4 2019 3:57 PM | Last Updated on Sun, Apr 7 2019 12:28 PM

Mahesh Babu is The Reason for Maharshi Delay - Sakshi

సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మహర్షి. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈపాటికే రిలీజ్‌ కావాల్సి ఉన్నా, అనివార్య కారణాల వల్ల వాయిదాపడుతూ వస్తోంది. ఈ ఆలస్యానికి కారణం మహేషే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మహేష్.. తను నటిస్తున్న ప్రకటనల షూటింగ్‌ కోసం మహర్షి సినిమా షూటింగ్‌ను వాయిదా వేశారన్న టాక్‌ వినిపిస్తోంది. అందుకే ఈ సినిమా షూటింగ్‌ ఆలస్యమవుతుందన్న టాక్‌ వినిపిస్తోంది. మే 9న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాకు షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. మరో రెండు పాటలను తెరకెక్కించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో మరో యాడ్‌ షూట్‌ కోసం మహేష్  షూటింగ్‌కు బ్రేక్‌ ఇస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ స్పందించలేదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement