చెన్నైలో సండే నుంచి షురూ!
మహేశ్‌బాబుకి మాస్.. క్లాస్.. తేడా లేదు. ప్రతి సినిమాలోనూ ఫర్ఫెక్షన్ చూపించడానికి ప్రయత్నిస్తారు. క్లాసులో మాస్‌నీ, మాసులో క్లాస్‌నీ మిక్స్ చేసి కమర్షియల్ పంథాలో సందేశాత్మక సినిమాలు తీసే దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెల్సిందే. ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ఆదివారం చెన్నైలో ప్రారంభం కానుంది.
ఇటీవల హైదరాబాద్‌లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌తో పాటు ఫైట్ సీక్వెన్స్‌లో కొంత పార్ట్ షూట్ చేశారు. చెన్నైలో తీయనున్న సన్నివేశాల కోసం స్పెషల్ సెట్ రెడీ చేశారట. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్. మహేశ్, రకుల్ కలసి నటిస్తున్న తొలి సినిమా ఇది. ఇందులో మహేశ్‌బాబు ఇంటిలిజెన్స్ ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను దసరా కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారట. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సంతోష్ శివన్, సంగీతం: హారీస్ జయరాజ్.