'తెలుగు నేర్చుకుంటున్నా..!' | Malayala star hero mohanlala learning telugu | Sakshi
Sakshi News home page

'తెలుగు నేర్చుకుంటున్నా..!'

Published Tue, Dec 29 2015 11:08 AM | Last Updated on Sun, Sep 3 2017 2:46 PM

'తెలుగు నేర్చుకుంటున్నా..!'

'తెలుగు నేర్చుకుంటున్నా..!'

దశాబ్దాలుగా మలయాళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్గా వెలుగొందుతున్న మోహన్ లాల్, తను ఆ స్టేటస్కు ఎందుకు అర్హుడో మరోసారి ప్రూవ్ చేశాడు. ఇప్పటికే నటుడిగా ఎన్నో అత్యున్నత పురస్కారాలను అందుకున్న మోహన్ లాల్, ఇప్పటికీ ప్రతి సినిమా కోసం ఎంతో హోం వర్క్ చేస్తారు. మలయాళంతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా నటించిన ఈ మెగాస్టార్ త్వరలో రెండు తెలుగు సినిమాలకు రెడీ అవుతున్నాడు.

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ (వర్కింగ్ టైటిల్)లో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాతో పాటు విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహిమ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ రెండూ 2016లోనే రిలీజ్ కానున్నాయి. అయితే ఈ రెండు సినిమాల కోసం ప్రత్యేకంగా తెలుగు మాట్లాడటం నేర్చుకుంటున్నాడు మోహన్ లాల్. కథలోని భావాన్ని సరిగ్గా పలికించాలంటే భాష మీద పట్టు ఉండాలనే ఉద్దేశంతో తెలుగు భాషను అభ్యసిస్తున్నాడు.

మలయాళంలో డబ్ అవుతున్న తెలుగు సినిమాలకు మాటల రచయితగా వ్యవహరిస్తున్న వ్యక్తి సాయంతో తెలుగు భాష మీద పట్టు కోసం ప్రయత్నిస్తున్నాడు మోహన్ లాల్. చాలారోజులుగా ఇదే పనిలో ఉన్న ఈయన.. తాజాగా తన ట్విట్టర్ పేజ్పై స్వయంగా తెలుగులో పోస్ట్ పెట్టాడు. 'తెలుగు నేర్చుకోవడం..!' అంటూ తన ఫొటోను ట్వీట్ చేశాడు మోహన్ లాల్.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement