త్రిస్సూర్: మలయాళ నటుడు, ప్రఖ్యాత మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ జయేశ్(44) కన్నుమూశారు. ఏడాది నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన అనారోగ్యం కారణంగా ఆదివారం కేరళలోని కోడాకర శాంతి ఆసుపత్రిలో చేరారు. చివరి వరకూ మృత్యువుతో పోరాడిన ఆయన సోమవారం ప్రాణాలు విడిచాడు. ఆయన మరణంతో మలయాళ చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. కాగా క్రితం రోజే మలయాళ చిత్ర నిర్మాత జిబిత్ జార్జ్ భారీ గుండెపోటుతో ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. (దర్శకుడు రాజ్ మోహన్ మృతి )
కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన గోపీ మీనన్, ఆరికట్టు గౌరీ దంపతులకు జయేశ్ జన్మించారు. అతను సునాజా అనే మహిళను వివాహం చేసుకోగా వీరికి ఓ బాబు జన్మించారు. రెండేళ్ల క్రితం అతని కుమారుడి మరణించగా ఆయనకు తీరని విషాదాన్ని మిగిల్చింది. ఇక ఆయన "ముల్లా" చిత్రంతో వెండితెరపై ప్రవేశించారు. 'ప్రేతమ్ 2', 'క్రేజీ గోపాలం', 'సుసు సూది వాల్మీకం' చిత్రాల్లో కీలక పాత్ర పోషించారు. అటు సినిమాలే కాకుండా, ఇటు పలు టీవీ షోలలోనూ కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. కానీ ఎప్పుడూ మిమిక్రీని వదిలిపెట్టలేదు. (పురుడు పోసిన సినీ రచయిత)
Comments
Please login to add a commentAdd a comment