సహనిర్మాతను మోసం చేసిన నటుడు!
సహనిర్మాతను మోసం చేసిన నటుడు!
Published Wed, Jan 4 2017 1:09 PM | Last Updated on Tue, Sep 5 2017 12:24 AM
కొచ్చి: మలయాళ నటుడు విజయ్ బాబు చిక్కుల్లో పడ్డాడు. తనపై దాడి చేశారని ఆరోపిస్తూ నిర్మాత శాండ్రా థామస్ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎలమక్కరలోని తన ఆఫీస్‌లో విజయ తనపై దాడి చేశాడని శాండ్రా మంగళవారం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం శాండ్రా ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్టు పోలీసులు తెలిపారు.
అయితే థామస్ పెట్టిన కేసుపై విజయ్ స్పందించాడు. తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. ’ నేను ఎంతో నమ్మిన భాగస్వామి, ఆమె భర్త నాపై తప్పుడు కేసు నమోదు చేశారు. వారిపై దాడి చేశాననడం అవాస్తవం.’ అని ఆయన తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. శాండ్రా, విజయ్ కలిసి ఫ్రైడే ఫిల్మ్ హౌస్ అనే నిర్మాణ సంస్థను నడుపుతున్నారు. ఈ పతాకంపై దాదాపు 10 చిత్రాలను నిర్మించారు.
Advertisement
Advertisement