
కొచ్చి : ప్రముఖ మలయాళీ నటి పార్వతి ప్రయాణిస్తున్న వాహనం రోడ్డుప్రమాదానికి గురైంది. కొచ్చి నుంచి త్రివేండానికి ఒక అద్దె ఇన్నోవా కారులో ఆమె ప్రయాణిస్తుండగా.. ఆమె వాహనం కారును ఢీకొట్టింది. ఆలపుజా ప్రాంతంలో జాతీయ రహదారిపై ఆమె ప్రయాణిస్తున్న ఇన్నోవా అదుపుతప్పి ముందు వెళుతున్న కారును ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో రెండు వాహనాల్లో ఉన్న వారికి పెద్దగా గాయాలు కాలేదు. ఎలాంటి గాయం కాకుండా పార్వతి ఈ ప్రమాదం నుంచి తప్పించుకుంది.
కమల్ హాసన్ ‘ఉత్తమ విలన్’ సినిమాలో నటించిన పార్వతి.. ప్రమాదం తర్వాత తన ప్రయాణాన్ని కొనసాగింది. ఈ ప్రమాద ఘటనపై రెండు పార్టీలు రాజీ కుదుర్చుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. తాజాగా ‘టేకాఫ్’ సినిమాకుగాను పార్వతి జాతీయ అవార్డు పొందింది. అయితే, రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందివ్వకపోవడంతో.. నిరసిస్తూ.. ఈ కార్యక్రమాన్ని ఇతర అవార్డుల గ్రహీతలతోపాటు ఆమె బహిష్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment