వివాదంపై స్పందించిన మెగాస్టార్‌ | Mammootty Responds on Parvathy controversy | Sakshi

వివాదంపై స్పందించిన మెగాస్టార్‌

Dec 29 2017 5:07 PM | Updated on Dec 29 2017 5:08 PM

 Mammootty Responds on Parvathy controversy - Sakshi

పార్వతి-మమ్ముట్టి ఫ్యాన్స్‌కు మధ్య జరుగుతున్న వివాదంపై కేరళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి నోరు విప్పారు. ఎవరికైనా మాట్లాడే హక్కు ఉందన్నారు. తను వివాదాల జోలికి వెళ్లనని తెలిపారు. మనకు అర్థవంతమైన చర్చలు జరగాలని, నా తరుపున మాట్లాడటానికి ఎవ్వరినీ నియమించలేదన్నారు. 

అసలు వివాదామేంటీ?
తిరువనంతపురంలో  జరిగిన ఐఫా వేడుకలో నటి పార్వతి మాట్లాడుతూ.. మమ్ముట్టి నటించిన ‘కసాబా’ సినిమాలోని డైలాగ్‌లు మహిళల్ని అవమానించేరీతిలో ఉన్నాయని అన్నారు. ఆమె నేరుగా మమ్ముట్టి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా...మమ్ముట్టి ఫ్యాన్స్‌ ఆమెపై సోషల్‌మీడియాలో అసభ్యకర కామెంట్స్‌తో వేధిస్తున్నారు. కొంతమంది హద్దు దాటి రేప్‌ చేస్తామని బెదిరించారు. మరికొంతమంది చంపుతామని హెచ్చరించారు. వేధింపులు ఎక్కువయ్యేసరికి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీ అడ్రస్‌ల ఆధారంగా వారిని గుర్తించి అరెస్ట్‌ చేస్తామని పోలీసులు తెలిపారు. 

ఇలాంటివి ఇంకెన్నో..
తమిళంలో విజయ్‌ నటించిన ఓ సినిమాపై జర్నలిస్ట్‌ ధన్యరాజేంద్రన్‌ కూడా తన అభిప్రాయాన్ని సోషల్‌మీడియాలో తెలిపింది. విజయ్‌ ‘సూర’  సినిమాను ఇంటర్వెల్‌ వరకు చూడగలిగాను. కానీ, షారుఖ్‌ ‘జబ్‌ హ్యారి మెట్‌ సెజల్‌’ ఇంటర్వెల్‌ వరకు కూడా చూడలేకపోయాననీ, దాని రికార్డ్‌ని షారుఖ్‌ సినిమా బ్రేక్‌ చేసిందని ట్వీట్‌ చేసింది. మరుక్షణం నుంచి విజయ్‌ ఫ్యాన్స్‌ సోషల్‌మీడియాలో ఆమెపై దాడి చేయడం ప్రారంభించారు. అసభ్యకర పదాలతో వేధించారు. ఈ వివాదంపై విజయ్‌ స్పందిస్తూ...ఒక మహిళను అలా వేధించడం సరికాదని తన ఫ్యాన్స్‌కి హితబోధ చేశారు. అంతటితో వివాదానికి తెరపడింది.

ఇక టాలీవుడ్‌లో ఫాలోయింగ్‌ ఎక్కువ ఉన్న నటుడు పవన్‌కల్యాణ్‌. ఎవరు వేలెత్తి చూపినా.. ఫ్యాన్స్‌ సోషల్‌మీడియాలో దాడి ప్రారంభిస్తారు. ఆ మధ్య అల్లుఅర్జున్‌ ‘చెప్పను బ్రదర్‌’ ఎపిసోడ్‌ తర్వాత సోషల్‌మీడియాలో ఇద్దరి ఫ్యాన్స్‌ మధ్య పెద్ద యుద్ధమే జరిగిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement