గుజరాత్‌ లెక్క.. ‘షా’కు ఇచ్చిన మంచు లక్ష్మీ | Manchu Lakshmi Just Asked Amit Shah about Gujarat Seats | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 19 2017 1:54 PM | Last Updated on Tue, Aug 21 2018 2:39 PM

Manchu Lakshmi Just Asked Amit Shah about Gujarat Seats - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గుజరాత్‌ ఫలితాలపై అమిత్‌ షా ‘150 సీట్ల’ లెక్క తప్పిన వేళ.. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక ఆయన కాస్త ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నటి మంచు లక్ష్మీ ఈ ఉదయం చేసిన ఓ ట్వీట్‌ ఆసక్తికరంగా ఉంది. 

28 శాతం జీఎస్టీని ఉద్దేశిస్తూ ఆమె గుజరాత్‌ లో బీజేపీ గెలుచుకున్న సీట్ల సంఖ్యను అన్వయిస్తూ ఓ లెక్క చేసింది. మొత్తం 182 ను సీట్లను జీఎస్టీ శాతంతో లెక్కించి.. ఆ వచ్చిన సంఖ్యను 150(అమిత్‌ షా చెప్పిన ఫిగర్‌) నుంచి తీసేశారు. చివరగా 99 రాగా.. అది బీజేపీ గెల్చుకున్న ఫిగర్ అని తేలిపోయింది. 

జీఎస్టీ ప్రకారమే గుజరాత్ ప్రజలు మీకు తీర్పు కట్టబెట్టారంటూ మంచు లక్ష్మీ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుండగా.. ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్లు పెడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement