వైఫ్‌ ఆఫ్‌ రామ్‌కు అరుదైన గౌరవం | Manchu Lakshmi Wife of Ram selected for Ottawa film festival | Sakshi
Sakshi News home page

వైఫ్‌ ఆఫ్‌ రామ్‌కు అరుదైన గౌరవం

Published Sat, Jun 2 2018 12:48 AM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

 Manchu Lakshmi Wife of Ram selected for Ottawa film festival - Sakshi

లక్ష్మీ మంచు

లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలో దర్శకుడు విజయ్‌ యెలకంటి రూపొందించిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘వైఫ్‌ ఆఫ్‌ రామ్‌’. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్‌టైన్మెంట్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం రిలీజ్‌ కాక ముందే అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. కెనడాలో జరగబోయే ఒట్టావా ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అఫీషియల్‌ స్క్రీనింగ్‌కు ఈ సినిమా ఎంపికైంది.

జూన్‌ 13నుంచి జరగబోయే ఈ ఫెస్టివల్‌కు 2 డాక్యుమెంటరీలు, 9 ఫీచర్‌ ఫిల్మ్స్, 5 షార్ట్‌ ఫిల్మ్స్‌ ఎంపికయ్యాయి. వైఫ్‌ ఆఫ్‌ రామ్‌ రిలీజ్‌ అవ్వకముందే ‘సోషియల్లీ కాన్షియస్‌ థ్రిల్లర్‌’గా ఇందులో చోటు సంపాదించుకోవటం విశేషం. భర్తను చంపిన వాళ్లను ఛేదించే క్రమంలో ఓ యువతి ఎదుర్కొన్న వింత పరిస్థితులేంటి అన్నదే ఈ చిత్రకథ. సామ్రాట్‌ రెడ్డి, ఆదర్శ్‌ బాలకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం రఘు దీక్షిత్‌. కెమెరా: సామల భార్గవ్‌.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement