
మణిరత్నం సినిమా మొదలవుతోంది
ఓకే బంగారం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మణిరత్నం తన నెక్ట్స్ సినిమాను ప్రకటించడానికి చాలా సమయం తీసుకున్నాడు. మధ్యలో ఓ భారీ మల్టీ స్టారర్ సినిమా చేస్తాడంటూ వార్తలు వచ్చినా ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు. తరువాత ఇద్దరు యువ కథానాయకులతో సినిమా ప్రారంభించాలని ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో చాలా కాలంగా మణిరత్నం కాలీగా ఉన్నారు.
అయితే ఇటీవల తన లేటెస్ట్ సినిమా కాష్మోరా షూటింగ్ పూర్తి చేసుకున్న కార్తీ, మణిరత్నంతో చేయబోయే సినిమా పై క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా జూలై 8న లాంఛనంగా ప్రారంభం కానుంది. మణిరత్నంకు అత్యంత ఇష్టమైన లోకేషన్.. ఊటిలో ఈ సినిమా తొలి షెడ్యూల్ను ప్లాన్ చేశారు. కార్తీ సరసన అదితి రావు హైదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం, రవి వర్మన్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.