తెరపై అయ్యప్ప లీలలు | Manikanta leelalu movie Shooting in September | Sakshi
Sakshi News home page

తెరపై అయ్యప్ప లీలలు

Published Tue, Aug 19 2014 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM

తెరపై అయ్యప్ప లీలలు

తెరపై అయ్యప్ప లీలలు

 సీనియర్ దర్శకుడు సాగర్ దర్శకత్వంలో ‘మణికంఠ లీలలు’ పేరుతో ఓ చిత్రం రూపొందనుంది. శ్రీ ధనాకర్షణ లక్ష్మీకుబేర ఫిలింస్ పతాకంపై నందకిశోర్, సాయిమణికంథారెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. లక్ష్మీ వినాయక్ స్వర సారథ్యంలో ఇటీవలే హైదరాబాద్‌లో పాటల రికార్డింగ్ మొదలైంది. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ -‘‘అయ్యప్ప మాలధారణ నుంచి ప్రతి ఒక్క అంశాన్ని కూలంకషంగా ఈ చిత్రంలో చూపిస్తున్నాం’’ అని చెప్పారు. సెప్టెంబరులో చిత్రీకరణ మొదలుపెడతామని, నవంబరు నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఇందులో రెండు పాటలకు కీరవాణి స్వరకీర్తన చేస్తున్నారని సంగీత దర్శకుడు లక్ష్మీ వినాయక్ అన్నారు. ఆనందకిషోర్, సాయిమణికంథారెడ్డి, ‘చిత్రం’ శీను తదితరులు నటించనున్న ఈ చిత్రానికి కథ-పాటలు: రమణారెడ్డి, నందకిశోర్, కెమెరా: మురళీకృష్ణ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement