Director Sagar
-
విషాదం.. ప్రముఖ సీనియర్ దర్శకుడు కన్నుమూత
తెలుగు చలన చిత్ర పరిశ్రమ మరో విషాదంలో కూరుకుంది. 73 ఏళ్ల ప్రముఖ సీనియర్ దర్శకుడు సాగర్(విద్యాసాగర్ రెడ్డి) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించి ఈ ఉదయం గం. 6.03ని.లకు తుదిశ్వాస విడిచారు. 1983లో నరేష్-విజయశాంతిల ‘రాకాసిలోయ’సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన నటశేఖర కృష్ణతో తీసిన ‘అమ్మదొంగా’ చిత్రం మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. భానుచందర్, లిజీలతో ‘స్టూవర్ట్‌పురం దొంగలు, ఓసినా మరదలా, ఖైదీ బ్రదర్స్, యాక్షన్ నెంబర్ 1 సహా సుమారు 40 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఆయన తెరకెక్కించిన 'రామసక్కనోడు' చిత్రానికి మూడు నంది పురస్కారాలు లభించాయి. అంతేకాదు ఈయన తెలుగు సినిమా దర్శకులు సంఘానికి మూడు సార్లు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. శీనువైట్ల, వి.వి.వినాయక్ , శ్రీనువైట్ల, రవికుమార్ చౌదరి లాంటి ఎందరో దర్శకులు ఈయన శిష్యులే. సాగర్ మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. -
వామ్మో...భయపెడతారట
సీనియర్ దర్శకుడు సాగర్ దర్శకత్వంలో శ్రీనివాసరెడ్డి, జస్వంత్ హీరోలుగా జస్వంత్ నిర్మిస్తున్న ‘వామ్మో’ చిత్రం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి ఎస్.గోపాల్‌రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, బ్రహ్మానందం క్లాప్ ఇచ్చారు. తమ్మారెడ్డి భరద్వాజ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకూ తాను తీసిన 30 సినిమాల్లోకెల్లా విభిన్నంగా ఉండే సినిమా ఇదేననీ, వినోదంతో పాటు ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉండే హారర్ చిత్రమిదనీ సాగర్ చెప్పారు. కమెడియన్‌గా చేస్తూనే మంచి అవకాశం వస్తే.. హీరోగా నటిస్తున్నాననీ, సాగర్ లాంటి మంచి దర్శకునితో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాననీ శ్రీనివాసరెడ్డి అన్నారు. జనవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, మే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. బ్రహ్మానందం, సుధీర్, శ్రీను, మహేశ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వి.శ్రీనివాసరెడ్డి, కూర్పు: వి.నాగిరెడ్డి, సంగీతం: కీరవాణి, కోటి, మణిశర్మ, దేవిశ్రీప్రసాద్, నేపథ్య సంగీతం: సాయికార్తీక్. -
మరో సస్పెన్స్ థ్రిల్లర్
సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన చిత్రం ‘ఏమైంది’. విసుశ్రీ, ఈశ్వాశెట్టి జంటగా నటించారు. చలపతి మల్లాది దర్శకుడు. కేఎం నాయుడు, అల్లు రవి నిర్మాతలు. విశాల్‌సాయి స్వరాలందించిన ఈ చిత్రం పాటలను, హైదరాబాద్‌లో విడుదల చేశారు. పాటల సీడీని నిర్మాత ప్రసన్నకుమార్ ఆవిష్కరించి, దర్శకుడు సాగర్‌కి అందించారు. అన్ని వర్గాలవారికీ నచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ ఇదని దర్శకుడు చెప్పారు. సాంకేతికంగా ఈ చిత్రం వండర్ అనిపిస్తుందని నిర్మాతలు వ్యాఖ్యానించారు. -
తెరపై అయ్యప్ప లీలలు
సీనియర్ దర్శకుడు సాగర్ దర్శకత్వంలో ‘మణికంఠ లీలలు’ పేరుతో ఓ చిత్రం రూపొందనుంది. శ్రీ ధనాకర్షణ లక్ష్మీకుబేర ఫిలింస్ పతాకంపై నందకిశోర్, సాయిమణికంథారెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. లక్ష్మీ వినాయక్ స్వర సారథ్యంలో ఇటీవలే హైదరాబాద్‌లో పాటల రికార్డింగ్ మొదలైంది. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ -‘‘అయ్యప్ప మాలధారణ నుంచి ప్రతి ఒక్క అంశాన్ని కూలంకషంగా ఈ చిత్రంలో చూపిస్తున్నాం’’ అని చెప్పారు. సెప్టెంబరులో చిత్రీకరణ మొదలుపెడతామని, నవంబరు నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఇందులో రెండు పాటలకు కీరవాణి స్వరకీర్తన చేస్తున్నారని సంగీత దర్శకుడు లక్ష్మీ వినాయక్ అన్నారు. ఆనందకిషోర్, సాయిమణికంథారెడ్డి, ‘చిత్రం’ శీను తదితరులు నటించనున్న ఈ చిత్రానికి కథ-పాటలు: రమణారెడ్డి, నందకిశోర్, కెమెరా: మురళీకృష్ణ.