Nand Kishore
-
డిప్యూటీ కాగ్ జనరల్ గా నంద కిషోర్
న్యూఢిల్లీ: సీనియర్ ప్రభుత్వాధికారి నంద కిషోర్ డిప్యూటీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గా బుధవారం నియమితులయ్యారు. 1981లో ఇండియన్ అడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ అధికారిగా ఎంపికైన నంద కిషోర్ ప్రస్తుతం అదనపు డిప్యూటీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌గా విధులు నిర్వర్తిసున్నారు. ఆగస్టు 31న బల్వేందర్ సింగ్ పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో నంద కిషోర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయినట్టు డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఒక ప్రకటనలో పేర్కొంది. కేబినెట్ నియామకాల కమిటీ నంద కిషోర్‌ను డిప్యూటీ కాగ్ జనరల్ గా ఎంపికచేసింది. సెప్టెంబర్ 1 నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, ఇప్పటికే జాతీయ సంస్థ న్యాయ పునర్విచారణ ట్రిబ్యునల్ టెక్నినల్ మెంబర్ గా బల్వేందర్ సింగ్ నియమించిన సంగతి విదితమే. -
రైతన్న కష్టాలే కథాంశంగా...
దేశానికి అన్నం పెట్టే రైతు కష్టాల్లో ఉన్నాడు. అప్పుల పాలై తనువు చాలిస్తున్నాడు. దీనికి ప్రధాన కారణం ఏంటనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘నేచురల్ స్టార్ 9010140101’. ఎస్.ఎమ్.ఎస్ అనేది ఉపశీర్షిక. హీరోగా నటిస్తూ, స్వీయదర్శకత్వంలో నాగవరుణ్ తేజ రూపొందిస్తున్నారు. ప్రేక్షకులను ఆలోచింపజేసే కథా, కథనాలతో ఈ చిత్రం సాగుతుందని నాగవరుణ్ తేజ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: బాలకృష్ణ, కో ప్రొడ్యూసర్: నంద కిశోర్. -
తెరపై అయ్యప్ప లీలలు
సీనియర్ దర్శకుడు సాగర్ దర్శకత్వంలో ‘మణికంఠ లీలలు’ పేరుతో ఓ చిత్రం రూపొందనుంది. శ్రీ ధనాకర్షణ లక్ష్మీకుబేర ఫిలింస్ పతాకంపై నందకిశోర్, సాయిమణికంథారెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. లక్ష్మీ వినాయక్ స్వర సారథ్యంలో ఇటీవలే హైదరాబాద్‌లో పాటల రికార్డింగ్ మొదలైంది. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ -‘‘అయ్యప్ప మాలధారణ నుంచి ప్రతి ఒక్క అంశాన్ని కూలంకషంగా ఈ చిత్రంలో చూపిస్తున్నాం’’ అని చెప్పారు. సెప్టెంబరులో చిత్రీకరణ మొదలుపెడతామని, నవంబరు నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఇందులో రెండు పాటలకు కీరవాణి స్వరకీర్తన చేస్తున్నారని సంగీత దర్శకుడు లక్ష్మీ వినాయక్ అన్నారు. ఆనందకిషోర్, సాయిమణికంథారెడ్డి, ‘చిత్రం’ శీను తదితరులు నటించనున్న ఈ చిత్రానికి కథ-పాటలు: రమణారెడ్డి, నందకిశోర్, కెమెరా: మురళీకృష్ణ.