'నతాషా శర్మతో జీవితం బాగుంది'
న్యూఢిల్లీ: సుప్రసిద్ద టీవీ నటుడు ఆదిత్య రెడిజ్ తన మ్యారేజ్ లైఫ్ గురించి సంతృప్తి వ్యక్తం చేశాడు. కలర్ ఛానెల్ లో ప్రసారమైన 'నా అన్నా ఈజ్ దేశ్ లాడ్' కార్యక్రమంలో అతనికి జోడీ కట్టిన నటి నతాషాను గత సంవత్సరం ఆదిత్య వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై జాతీయ వార్తసంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో తన ప్రస్తుత జీవితం గురించి పలు విషయాలను వెల్లడించాడు. 'నా వివాహ జీవితం చాలా బాగుంది. నాకు నతాషా ఎప్పుడూ సహకరిస్త్తూ ఉంటుంది.
పెళ్లి అయిన తరువాత 'బంధాన్' షూటింగ్ లో బిజీగా ఉన్నాను. షూటింగ్ నిమిత్తం వారంలో మూడు నాలుగు రోజులు బయటే ఉంటాను. అయినా నాకు సంబంధించిన వ్యవహారాలను ఆమె బాగా హ్యాండిల్ చేస్తుంది'అంటూ భార్యను ప్రశంసలతో ముంచెత్తాడు.