జులై 21న 'మాయా మాల్' | Maya Mall Release Date Postponed | Sakshi
Sakshi News home page

జులై 21న 'మాయా మాల్'

Published Wed, Jul 12 2017 4:10 PM | Last Updated on Tue, Sep 5 2017 3:52 PM

జులై 21న 'మాయా మాల్'

జులై 21న 'మాయా మాల్'

దిలీప్, ఇషా, దీక్షాపంత్ లీడ్ రోల్లో రూపొందుతున్న చిత్రం 'మాయామాల్'. హారర్ కామెడీ ఎంటర్ టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని జులై 14న విడుదల కావాల్సి ఉండగా.. డిస్ట్రిబ్యూటర్స్ సలహా మేరకు చిత్రాన్ని ఒకవారం పోస్ట్ పోన్ చేసి జులై 21న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు రెడీ అవుతున్నారు. గోవింద్ లాలం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ ఎంటర్టైనర్ను కె.వి.హరికృష్ణ, చందు ముప్పాళ్ల, నల్లం శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన హరికృష్ణ మాట్లాడుతూ.. 'జూలై 14న మా 'మాయా మాల్'ను విడుదల చేసేందుకు అన్నీ సిద్ధంగా ఉన్నప్పటికీ.. ఆ రోజున ఎక్కువ సినిమాలు విడుదలవుతుండటంతో.. అదేరోజు విడుదల చేస్తే సినిమా ఎక్కువమంది జనాలకి చేరువయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని మా డిస్ట్రిబ్యూటర్లు సూచించడంతో.. జులై 21కి విడుదలను వాయిదా వేయడం జరిగింది. అనుకున్నదానికంటే సినిమా ఔట్ పుట్ బాగా వచ్చింది. సినిమాలో విలన్ ఎవరనేది ఆసక్తికరమైన అంశం' అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement