హీరోయిన్‌కు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ వేధింపులు! | Meera Chopra Ask NTR To Respond His Fans Behaviour | Sakshi
Sakshi News home page

నా ట్వీట్‌పై ఎన్టీఆర్‌ స్పందిస్తారని ఆశిస్తున్నా : మీరా చోప్రా

Published Tue, Jun 2 2020 8:29 PM | Last Updated on Tue, Jun 2 2020 8:30 PM

Meera Chopra Ask NTR To Respond His Fans Behaviour - Sakshi

తనను యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో వేధిస్తున్నారని హీరోయిన్‌ మీరా చోప్రా ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం రోజున ట్విటర్‌ వేదిగా మీరా చోప్రా అభిమానులతో చిట్‌ చాట్‌  నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్‌ తెలుగులో మీకు ఇష్టమైన హీరో ఎవరని ప్రశ్నించగా.. దానికి ఆమె మహేష్‌బాబు అని ఆమె సమాధానం ఇచ్చారు. మరో నెటిజన్‌ ఎన్టీఆర్‌ గురించి ప్రశ్నించగా.. తను ఆయన ఫ్యాన్‌ కాదని చెప్పారు. అయితే ఈ సమాధానం చెప్పినందుకు ఎన్టీఆర్‌ అభిమానులు తనను తీవ్రమైన పదాలతో దూషిస్తున్నారని ఆమె నేడు ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ఇటువంటి అభిమానుల ఫాలోయింగ్‌తో మీరు సక్సెస్‌ అయినట్టు భావిస్తున్నారా అని ఎన్టీఆర్‌ను ప్రశ్నించారు. అలాగే ఈ ట్వీట్‌పై ఎన్టీఆర్‌ స్పందిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. 

‘తారక్...  నీ అభిమానులు నన్ను వేశ్య, పోర్న్‌ స్టార్‌​ వంటి పదాలతో పిలుస్తారని అనుకోలేదు. కేవలం నీ కంటే మహేశ్ బాబునే ఎక్కువగా ఇష్టపడతానని నేను చెప్పడంతో ఇది జరిగింది. నీ అభిమానులు నా తల్లిదండ్రులకు కూడా ఇలాంటి అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నారు. ఇటువంటి అభిమానులతో మీరు సక్సెస్ సాధించినట్టు భావిస్తున్నారా?. మీరు తప్పకుండా నా ట్వీట్ పట్ల స్పందిస్తారని ఆశిస్తున్నాను’ అని మీరా పేర్కొన్నారు. కాగా, తెలుగులో బంగారం, వాన, మారో, గ్రీకువీరుడు.. వంటి చిత్రాల్లో నటించిన మీరా చోప్రా ఆ తర్వాత తెలుగు తెరకు దూరమయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement