తొమ్మిదోబిడ్డకు తండ్రికాబోతున్న నటుడు
హాలీవుడ్ నటుడు, దర్శకనిర్మాత మెల్ గిబ్సన్ 60వ ఏట 9వ బిడ్డకు తండ్రికాబోతున్నాడు. గిబ్సన్ ద్వారా ఆయన గాళ్ఫ్రెండ్ రోసాలిండ్ రోజ్ (26) బిడ్డకు జన్మనివ్వనుంది.
గిబ్సన్కు ప్రస్తుతం ఎనిమిదిమంది సంతానం ఉన్నారు. మాజీ భార్య రాబిన్ మూరే ద్వారా ఏడుగురు పిల్లలు పుట్టారు. గిబ్సన్ తొలిసంతానం థామస్కు 17 ఏళ్లు. 1980లో రాబిన్ను వివాహం చేసుకున్న ఆయన 2006 వరకు ఆమెతో కలిసున్నాడు. మూరే నుంచి విడిపోయాక ఒక్సానా గ్రిగోరీవాతో కొంతకాలం డేటింగ్ చేశాడు. వీరిద్దరికీ ఆరేళ్ల కూతురు ఉంది. ఒక్సానాతో కూడా బంధాన్ని కటీఫ్ చేసుకున్న గిబ్సన్ రోజ్కు దగ్గరయ్యాడు.
స్క్రిప్ట్ రైటర్ అయిన రోజ్ 2015లో గిబ్సన్ ప్రొడక్షన్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఆ తర్వాత ఇద్దరూ సన్నిహితులయ్యారు. ప్రస్తుతం రోజ్తో డేటింగ్లో ఉన్న గిబ్సన్ గత మేలో ఆమెతో కలసి కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో సందడి చేశాడు. రోజ్ ప్రెగ్నెసీతో ఉన్నట్టు వారి స్నేహితుడు చెప్పాడని ఓ మేగజైన్ వెల్లడించింది.