
మడికట్టు అమ్మీగా మిల్కీబ్యూటీ
బాహుబలి చిత్రంలో పోరుకు కాలు దువ్విన వీరనారి అవంతికగా నటించి ఆ పాత్రకు ప్రాణం పోసిన మిల్కీబ్యూటీ తమన్నా అందరి మన్ననలను పొందిన విషయం తెలిసిందే. ఆ చిత్రం అమ్మడికి రీఎంట్రీ ఇచ్చిందనే చెప్పాలి.అంతకు ముందు వరకూ గ్లామర్ పాత్రలకే పరిమితమైన తమన్నా దశ, దిశను బాహుబలి చిత్రం మార్చేసిందనే చెప్పొచ్చు. ఆ తరువాత వరుసగా నటనకు అవకాశం ఉన్న పాత్రలే ఆ ముద్దుగుమ్మను వరిస్తున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం మంచి జోష్‌లో ఉన్న తమన్నా తాజాగా మడికట్టు అమ్మీ అవతారమెత్తింది. ఒక పక్క సంచలన నటుడు శింబుతో అన్భానవన్ అసరాధవన్ అడంగాధవన్ చిత్రంలో రొమాన్స్ చేస్తున్న ఈ బ్యూటీ మరో పక్క సియాన్ విక్రమ్‌తో స్కెచ్ చిత్రంలో డ్యూయెట్లు పాడుతోంది.
ఇది ఉత్తరచెన్నై నేపథ్యంలో సాగే పక్తు కమర్షియల్ కథా చిత్రంగా ఉంటుందట. సాధారణంగా ఉత్తర చెన్నై నేపథ్యంలో చిత్రాలనగానే హీరో సహా ఇతర పాత్రలన్నీ నల్లముఖాలతో, తలకు నూనె కూడా రాయకుండా చింపిరి జుత్తుతో కనిపించేలా చూపిస్తుంటారు. స్కెచ్ చిత్రంలో దాదా అయిన విక్రమ్ కూడా కొన్ని సన్నివేశాల్లో అలాంటి గెటప్‌లోనే కనిసిస్తారట. ఆ తరువాత కొత్త గెటప్‌నకు మారతాడట. ఒక ఆయనకు జంటగా నటిస్తున్న మిల్కీబ్యూటీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువతి పాత్రలో దర్శనమిస్తుందట. ఇందులో పాఠాలు చెప్పే టీచరమ్మగా నటిస్తున్న తమన్నా కొన్ని సన్నివేశాల్లో మడికట్టు అమ్మీగా మెరవనుందట.స్కెచ్ చిత్రంలో ఈ అమ్మడి పాత్ర చాలా కీలకంగా ఉంటుందట.ఈ భామ విక్రమ్‌తో తొలిసారిగా జత కడుతున్న చిత్రం ఇదన్నది గమనార్హం.